
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతున్న విచారణ కీలక మలుపు తిరిగింది. ఎన్నికలకు అంతరాయం కలిగించే కుట్రతో పాటు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌ను గెలిపించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారని ఆరోపిస్తూ 13 మంది రష్యన్లు, 3 సంస్థలపై (రష్యా ప్రభుత్వ మద్దతున్న ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్నీ–ట్రోల్ ఫామ్’ సహా) నేరారోపణలు నమోదయ్యాయి.
అమెరికా వ్యవస్థ సక్రమంగా పనిచేయకుండా వారంతా కుట్ర పన్నారని ఆరోపణలు చేశారు. రష్యా జోక్యంపై స్పెషల్ కౌన్సెల్‌గా విచారణ జరుపుతున్న ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ ఈ మేరకు శుక్రవారం ఫెడరల్ ప్రభుత్వం తరఫున ఆరోపణలు నమోదు చేశారు. కాగా, ‘ప్రచారంలో మా బృందం ఎలాంటి తప్పులు చేయలేదు. ఎవరితోనూ కుమ్మక్కు కాలేదు’ అని అధ్యక్షుడు ట్రంప్ ట్వీటర్‌లో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment