దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 198 పాయింట్లు తగ్గి 24,107కు చేరింది. సెన్సెక్స్ 671 పాయింట్లు నష్టపోయి 79,022 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.28 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.41 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.8 శాతం పుంజుకుంది.
ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!
రేపు (మంగళవారం 5వ తేదీ) యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్‌గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment