దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ 52 పాయింట్లు తగ్గి 23,942కు చేరింది. సెన్సెక్స్ 186 పాయింట్లు నష్టపోయి 78,607 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 103.92 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.28 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.33 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: ఆర్‌బీఐలో ఉద్యోగానికి దరఖాస్తులు.. అర్హతలివే..
సోమవారం మార్కెట్‌లో ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా రియల్టీ ఇండెక్స్ 3% క్షీణించింది. ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన సూచీలు 2.50% పడ్డాయి. టెలికమ్యూనికేషన్, విద్యుత్, కమోడిటీ షేర్లు 1.50% నష్టపోయాయి. వాస్తవానికి చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 2% పతనమైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.50% నష్టపోయింది. ఈరోజు రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) యూఎస్ అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో మార్కెట్‌లో కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment