
సాక్షి: ఈ నెల 10న ప్రకటించిన జాబితా ప్రకారం ఉమ్మడి వరంగల్‌లో ఓటర్ల సంఖ్య 29,74,631. ఇందులో వయస్సుల వారీగా చూస్తే యువ, నవ ఓటర్లు 14,70,458 మంది ఉన్నారు. అత్యధిక శాతం పోలయ్యే ఈ ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారన్న అంశం ప్రధానంగా మారింది. ఓ వైపు రాజకీయ విశ్లేషకుల్లో ఇదే చర్చ జరుగుతుండగా.. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఈ ఓట్లపైనే ఫోకస్ పెడుతున్నాయి.
అలాగే 40–49 ఏళ్ల వయస్సున్న ఓటర్లతో పాటు 50–59 ఏళ్లలోపు వయసున్న వారిని తమవైపు తిప్పుకునేందుకు నియోజకవర్గాలు, మండలాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించి తాయిలాలు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. అదే విధంగా 60 నుంచి 80 ప్లస్ వయస్సున్న ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లి ఓటు వేయించే దిశగా వ్యూహరచనలో నిమగ్నమైన ప్రధాన పార్టీలు.. నవ, యువ ఓటర్లను ఆకట్టుకోవడంపైనే దృష్టి సారించడం చర్చ నీయాంశం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment