2024 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. చివరి దశ ఓటింగ్ జూన్ ఒకటిన జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం తమదేననే నమ్మకంతో ఉంది. ప్రధాని మోదీ కూడా బీజేపీకి 400కు పైగా లోక్‌సభ స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పారు. అయితే ‘బెట్టింగ్ మార్కెట్’ దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది.
ముంబైకి చెందిన టాప్ బుకీ ఒకరు మీడియాతో మాట్లాడుతూ ప్రారంభంలో అంటే మొదటి దశ ఓటింగ్‌కు ముందు, బీజేపీకి దక్కే సీట్లు అధికంగా ఉంటాయనే అంచనాలున్నాయన్నారు. అయితే అయితే మూడు దశల ఓటింగ్ తర్వాత బీజేపీకి ఆదరణ తగ్గిందన్నారు. ఇప్పుడు ఆరు దశల ఓటింగ్ తర్వాత బీజేపీ పరిస్థితి తారుమారయ్యిదన్నారు.
బెట్టింగ్ మార్కెట్ అంచనాల ప్రకారం ప్రస్తుతం బీజేపీ 295 నుంచి 305 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 55 నుంచి 65 సీట్లు వస్తాయనే అంచానాలున్నాయి. మార్కెట్ ఎప్పుడూ బీజేపీ చెప్పిన 400 లెక్కకు మద్దతునివ్వలేదు. మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం బీజేపీకి 350 సీట్లు కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ముంబై బుకీ తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లోని బెట్టింగ్ మార్కెట్లు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు దక్కే లోక్‌సభ సీట్లపై వేసిన అంచనాలిలా ఉన్నాయి.
ఫలోడి బెట్టింగ్ మార్కెట్ (రాజస్థాన్)
🔹కాంగ్రెస్ - 117
🔹ఇండియా - 246
🔹బీజేపీ - 209
🔹ఎన్‌డీఏ - 253
పాలన్పూర్ (గుజరాత్)
🔹కాంగ్రెస్ - 112
🔹ఇండియా - 225
🔹బీజేపీ - 216
🔹ఎన్‌డీఏ - 247
కర్నాల్ (హర్యానా)
🔹కాంగ్రెస్ - 108
🔹ఇండియా - 231
🔹బీజేపీ - 235
🔹ఎన్‌డీఏ-263
బెల్గాం (కర్నాటక)
🔹కాంగ్రెస్ - 120
🔹ఇండియా - 230
🔹బీజేపీ - 223
🔹ఎన్‌డీఏ-265
కోల్‌కతా
🔹కాంగ్రెస్ - 128
🔹భారతదేశం - 228
🔹బీజేపీ - 218
🔹ఎన్‌డీఏ - 261
విజయవాడ
🔹కాంగ్రెస్ - 121
🔹ఇండియా- 237
🔹బీజేపీ - 224
🔹ఎన్‌డీఏ - 251
ఇండోర్
🔹కాంగ్రెస్ - 94
🔹ఇండియా - 180
🔹బీజేపీ - 260
🔹ఎన్‌డీఏ - 283
అహ్మదాబాద్
🔹కాంగ్రెస్ - 104
🔹ఇండియా - 193
🔹బీజేపీ - 241
🔹ఎన్‌డీఏ-270
సూరత్
🔹కాంగ్రెస్ - 96
🔹ఇండియా - 186
🔹బీజేపీ - 247
🔹ఎన్‌డీఏ - 282
దేశంలోని పలు బెట్టింగ్ మార్కెట్‌లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీల మధ్య గట్టి పోటీని సూచిస్తున్నాయి. జూన్ ఒకటిన చివరి దశ ఓటింగ్ జరిగాక, జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఏ పార్టీ సత్తా ఎంతో తేలిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment