
రామనగర: రామనగర నగరసభ ఎన్నికల్లో కోవిడ్‌తో మృతి చెందిన అభ్యర్థి లీలకు భారీ విజయం లభించింది. 4వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమో పోటీ చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఆమె గత గురువారం కోవిడ్‌తో మృతి చెందారు.
పరువు నిలుపుకొన్న జేడీఎస్
దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ నగరసభ ఎన్నికల్లో జేడీఎస్ పరువు దక్కించుకుంది. 31 వార్డులకు గాను జేడీఎస్ 16 వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెస్, బీజేపీ తలా 7 స్థానాల్లో గెలుపొందాయి. ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందాడు. దీంతో రామనగరలో డీలా పడిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన నియోజకవర్గంలో పరువు కాపాడుకోగలిగారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ, స్థానికంగా ఎంతో ప్రాబల్యం ఉన్న సీపీ యోగేశ్వర్ తనకున్న పరపతితో ఓట్లను పొందలేకపోయారు. ఇక డీకే బ్రదర్స్ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చూపలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment