
బెంగళూరు: జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. అదే రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక కూడా జరగనుంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీలో సమావేశమవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. కాంగ్రెస్‌కు చెందిన రమేశ్ కుమార్ పేరును స్పీకర్ పదవికి ఇప్పటికే ఖరారు చేయగా, డిప్యూటీ స్పీకర్‌గా జేడీఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం దక్కనుంది.