
హుబ్లీ : కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఓటు బ్యాంక్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉందా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వేసిన సెటైర్లపై కర్నాటక సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. తాను దేశభక్తుడిని కాదని ప్రధాని మోదీ చెబుతున్నారని, దేశభక్తి గురించి తాను మోదీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. దేవెగౌడ ప్రధానిగా ఉండగా కశ్మీర్‌లో ఒక్క పేలుడు ఘటన చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. అది తమ వారసత్వమని, తనపై ముద్ర వేసే హక్కు ప్రధాని మోదీకి లేదని కుమారస్వామి పేర్కొన్నారు.
బీజేపీ తన మేనిఫెస్టోలో అవినీతిరహిత పాలన అందిస్తామని పేర్కొందని మరి మోదీ దేశమంతటా తిరిగి టీ అమ్మి బీజేపీని సంపన్న పార్టీగా చేశారా అని ఎద్దేవా చేశారు. అవినీతి రహిత సర్కార్ అని ఆయన చెప్పుకోవడం బూటకమని వ్యాఖ్యానించారు. కర్వార్‌లో ఓ బీజేపీ నేత నుంచి పట్టుబడ్డ రూ 78 లక్షలు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment