పరిమితుల్లేని రైతు రుణమాఫీ | JD(S) releases manifesto, promises 100 % farm loan waiver | Sakshi
Sakshi News home page

పరిమితుల్లేని రైతు రుణమాఫీ

Published Tue, May 8 2018 1:55 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

JD(S) releases manifesto, promises 100 % farm loan waiver - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి వస్తే రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలపై పరిమితులేమీ లేకుండా పూర్తిగా మాఫీ చేస్తామని జేడీఎస్‌ హామీనిచ్చింది. రైతులకు ఎరువులు, విత్తనాలను ఉచితంగా అందజేస్తామంది. కర్ణాటక ఎన్నికల కోసం జేడీఎస్‌ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి సోమవారం విడుదల చేశారు. ‘జనతా ప్రణాళిక – జనాలే పాలకులు’ పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో జేడీఎస్‌ పలు హామీలను ఇచ్చింది.

కొన్ని ముఖ్య వాగ్దానాలు: 65 ఏళ్లు పైబడిన పేదలకు నెలకు రూ.6వేల పింఛన్‌  లోకాయుక్త ఏకీకరణ, ఏసీబీ రద్దు  పేద మహిళలకు కుటుంబ నిర్వహణ నిమిత్తం నెలకు రూ.2 వేలు  రైతు సమస్యలు వినడానికి ప్రతి నెలా ముఖాముఖి కార్యక్రమం  పీజీ వరకు ఉచిత విద్య  ఉద్యోగ శిక్షణ కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం  ప్రతి న్యాయవాదికీ నెలకు రూ.5 వేల ఉపకార వేతనం  సాగునీటి కోసం ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల ఖర్చు  బెంగళూరుకు కొత్తగా మరో రింగు రోడ్డు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement