హెలికాప్టర్ తనిఖీలు నిర్వహిస్తోన్న ఈసీ సిబ్బంది
బెంగుళూరు: కర్ణాటకలో ఈసీ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల అధికారులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలను కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు. శివమొగ్గలో ప్రచార నిమిత్తం వచ్చిన సీఎం కుమారస్వామి హెలికాప్టర్‌లో ఎన్నికల స్క్వాడ్ క్షుణ్ణంగా తఖీలు చేసింది. అలాగే ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప హెలికాప్టర్‌లో కూడా తనిఖీలు నిర్వహించింది. కర్ణాటకలో ఈసారి ఎన్నికలు రెండు దశల్లో జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ నెల 18న జరిగే తొలిదశంలో 14 స్ధానాలకు పోలింగ్ జరగనుంది.
గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ జరగ్గా మోదీ హవాతో బీజేపీ 17 స్థానాలు దక్కించుకుంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్‌లో కూడా ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది తనిఖీలు చేసినట్లు తెలిసింది. నవీన్ పట్నాయక్ సూట్ కేసును కూడా నిశితంగా పరిశీలించి..చివరికి ఏమీ దొరక్కపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం అందింది.
Comments
Please login to add a commentAdd a comment