
భారతీయ శిక్షా స్మృతిని సమీక్షించాలి
21వ శతాబ్దంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారతీయ శిక్ష్మా స్మృతి (ఐపీసీ) లో మార్పులు తీసుకురావాలని రాష్ట్రపతి ప్రణబ్ అన్నారు.
21వ శతాబ్దంలో మార్పులు తప్పనిసరి: ప్రణబ్
కొచ్చి: 21వ శతాబ్దంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారతీయ శిక్ష్మా స్మృతి (ఐపీసీ) లో మార్పులు తీసుకురావాలని రాష్ట్రపతి ప్రణబ్ అన్నారు. కొచ్చిలో ఐపీసీ 155వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమం ముగింపు సభలో రాష్ట్రపతి పాల్గొన్నారు. మొదట రూపొందించిన జాబితాకు కొన్ని నేరాలను మాత్రమే చేర్చారన్నారు.
జేఎన్‌యూ విద్యార్థులపై రాజద్రోహం కేసుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు కొట్టాయంలో సీఎంఎస్ కళాశాల రెండో శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి.. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో మన ఉన్నత విద్యా సంస్థలు వెనుకబడి పోతున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో దేశ సత్తా చాటేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర కృషి సలపాలని పిలుపునిచ్చారు.