
న్యూఢిల్లీ: 2014– 2019 మధ్యకాలంలో దేశంలో దేశద్రోహం ఆరోపణలకు వర్తించే ఐపీసీ 124ఏ సెక్షన్ కింద మొత్తం 326 కేసులు నమోదయ్యాయి. వీటిలో 141 కేసుల్లో చార్జ్‌షీట్ నమోదవగా, 6 కేసుల్లో మాత్రమే నేరం రుజువై, దోషులకు శిక్ష పడింది. ఈ సెక్షన్ దుర్వినియోగమవుతోందని, బ్రిటిష్ వలస పాలన కాలం నాటి ఈ సెక్షన్ ఇంకా అవసరమా? అని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మొత్తం 326 కేసుల్లో అత్యధికంగా 54 కేసులు అస్సాంలోనే నమోదయ్యాయి. అస్సాంలో 54 కేసులకు గానూ, 26 కేసుల్లో చార్జ్‌షీట్ నమోదు కాగా, 25 కేసుల్లో విచారణ ముగిసింది. అయితే, వీటిలో ఏ ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment