బ్యాంకాక్‌లో బ్రహ్మాండమైన క్లబ్ అది. క్లబ్‌లోకి ఎంటరైన ఉప్పీ... అదేనండీ ఉపేంద్రకు సాంగ్ సింగాలనిపించింది. డ్యాన్స్ చేయాలనిపించింది. అక్కడే బోలెడంత మంది రష్యన్ డ్యాన్సర్లు ఉన్నారు. ఉప్పీతో కాలు కదపడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు. అంతే.. క్లబ్‌లో పెప్పీ సాంగ్ స్టార్టయింది. ఇంతకీ ఉపేంద్ర బ్యాంకాక్ వెళ్లడం ఏంటి? క్లబ్‌లో చిందేయడం ఏంటి? అనుకుంటున్నారా! ‘ఉప్పీ రూపీ’ అనే సినిమా కోసమే ఇదంతా. కె. మాధేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం బ్యాంకాక్‌లో ఓ క్లబ్ సాంగ్, ఉప్పీ, చిత్రకథానాయిక రచితా రామ్ పాల్గొనగా ఒక డ్యూయెట్ సాంగ్ తీశారు. అక్కడే ఒక మేజర్ ఫైట్ కూడా షూట్ చేశారు.
ఇందులో ఉపేంద్ర కామన్ మాన్ క్యారెక్టర్ చేస్తున్నారు. నెగటివ్ షేడ్ నుంచి హీరోగా మారే పాత్ర ఇది. అవినీతి అధికారులకు అద్దంలా ఉప్పీ పాత్ర ఉంటుంది. ఈ రేసీ పొలిటికల్ డ్రామా ఉప్పీ కెరీర్‌లో మరో మరపు రాని సినిమాగా నిలిచిపోతుందట. ‘ఉప్పీ రూపీ’ షూటింగ్ బ్యాంకాక్ లో ముగించుకుని, అక్కణ్ణుంచి ఉప్పీ స్ట్రైట్‌గా హైదరాబాద్ వచ్చేస్తారు. ఆయన నటిస్తోన్న మరో చిత్రం ‘హోమ్ మినిస్టర్’ షూటింగ్ ఇక్కడ జరగనుంది. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోంది. టైటిల్‌ని బట్టి ఇది పొలిటికల్ మూవీ అనుకునేరు. ప్రతి భర్తకీ అతని భార్యే హోమ్ మినిస్టర్. ఈ నేపథ్యంలోనే సినిమా ఉంటుందట. శ్రీహరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment