
బ్యాంకాక్ : ఎండకు అలసిపోయిన ఓ కోతి కాఫీ తాగి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో చోటు చేసుకుంది. బ్యాంకాక్‌కు వచ్చిన ఓ టూరిస్టు బైక్‌పై కూర్చుని కాఫీ తాగుతున్నాడు. దాహర్తితో ఉన్న కోతి.. బైక్‌పై దూకి అతని చేతిలో కాఫీ కప్పును తీసుకుని పారిపోయింది.
అనంతరం కాఫీని తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో స్థానికులు కోతిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే కోతి మరణించింది. కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉండటం వల్లే దాన్ని సేవించిన కోతి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment