
కువైట్ సిటీ: కరోనా అన్‌లాక్‌లో ఒకవైపు ఫుట్‌బాల్, క్రికెట్, ఫార్ములావన్ (ఎఫ్1) వంటి క్రీడలు పునరాగమనం చేయగా.... మరోవైపు మాత్రం పలు క్రీడా ఈవెంట్‌లు వాయిదా పడుతూనే ఉన్నాయి. నిన్న చైనా మాస్టర్స్, డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించగా... తాజాగా ఆ జాబితాలో ఆసియా బీచ్ క్రీడలు కూడా చేరాయి. షెడ్యూల్ ప్రకారం చైనాలోని సాన్యా నగరం వేదికగా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు ఆరో ఆసియా బీచ్ క్రీడలు జరగాలి. అయితే చైనాతోపాటు ఇతర దేశాల్లో కరోనా వైరస్ నేపథ్యంలో ఈ క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) శనివారం ప్రకటించింది. ‘ఓసీఏ, చైనీస్ ఒలింపిక్ కమిటీ (సీఓసీ), సాన్యా ఆసియా బీచ్ క్రీడల నిర్వాహక కమిటీ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది’ అని ఓసీఏ పేర్కొంది. త్వరలోనే ఈవెంట్‌కు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటిస్తామని ఓసీఏ తెలిపింది. ఆసియా బీచ్ క్రీడలు తొలిసారిగా బాలి వేదికగా 2008లో జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment