
తిండి గోల
బెటర్ గార్డ్
కాకరకాయ పేరు వింటేనే ముఖం అదోలా పెడతారు చాలామంది. ఆరోగ్యప్రదాయిని అని హెచ్చరిస్తే తప్పదన్నట్టు కాస్త కూరను భోజనంలో వడ్డించుకుంటారు. రుచి చూశాక మాత్రం ‘సూపర్’ అని కితాబులిచ్చేస్తారు. బిటర్‌గార్డ్, బిటర్ మెలన్ అంటూ విదేశీయులు దీనికి చాలా పేర్లే పెట్టారు. ఆసియా, ఆఫ్రికా మైదానాలలో విపరీతంగాపెరిగే తీగజాతి మొక్క కాకర. మనదేశం నుంచి 14వ శాతాబ్దంలో చైనాలోకి అడుగుపెట్టింది. కాకర సాగుబడి ద్రాక్ష తోటల పెంపకం మాదిరిగానే ఉంటుంది.
జూన్, జులై మాసాలలో పువ్వులతో సింగారించుకున్న ఈ మొక్క సెప్టెంబర్ నుంచి నవంబర్ నాటికి కాయలను ఇస్తుంది. చాలా వరకు వీటిని పచ్చగా ఉన్నప్పుడే కాయగూరగా వాడుతారు. పండుగా మారిన తర్వాత బాగా నీరుపట్టి ఇంచుమించు దోసకాయలా ఉంటుంది. వంటగానే కాక కొన్ని దేశాలలో నాటు వైద్యంగా కాకర రసాన్ని ఉపయోగిస్తారు.