కలెక్టర్ ద్వారా వివరాలు తెలుసుకుంటున్న వ్యవసాయ శాఖ కమిషనర్
తంగడంచెలో మెగా సీడ్ పార్క్
Published Mon, May 29 2017 10:01 PM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM
- అమెరికాలోని ఐఓడబ్ల్యూఏ స్టేట్ యునివర్సిటీ సాంకేతిక సహకారం
- ఒకటి, రెండు నెలల్లో సీఎం చేతులు మీదుగా శుంకుస్థాపనకు చర్యలు
- వ్యవసాయశాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్
కర్నూలు(అగ్రికల్చర్): జూపాడుబంగ్లా మండలం తంగడంచ ఫామ్‌లో ఆసియాలోనే అతిపెద్ద మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరి జవహార్‌లాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన సోమవారం తంగడంచెకు వెల్లి అమెరికాలోని ఐఓడబ్ల్యూఏ స్టేట్ యునివర్సిటీ ప్రతినిధులతో కలసి భూములను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణతో చర్చించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీడ్ పార్క్‌ను అమెరికాలోని ఐఓడబ్ల్యూఏ స్టేట్ యునివర్సిటీ సాంకేతిక సహకారంతో నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఒకటి, రెండు నెలల్లో ప్రాథమిక పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులుమీదుగా శంకు స్థాపన చేస్తామన్నారు. ప్రస్తుతం తంగడంచెలో 805 ఎకరాల భూములు ఉన్నాయని, సీడ్ పార్క్‌కు ఎంత అవసరమైతే అంత ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విత్తనోత్పత్తి, పరిశోధన, శిక్షణ, సీడ్ సర్టిపికేషన్ కార్పోరేషన్, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం శాఖ తదితర వన్ని ఇందులో ఉంటాయన్నారు. ఆయన వెంట నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ గోపాల్‌రెడ్డి, డీడీఏ పీపీ మల్లికార్జునరావు, ఏడీఏలు రమణారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, కర్నూలు ఏఓ అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు.
Advertisement