
కెరీర్‌కు లీ నా గుడ్‌బై!
వుహాన్ (చైనా): ఆసియాలో అత్యంత విజయవంతమైన టెన్నిస్ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్న లీ నా తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం. రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన 32 ఏళ్ల ఈ చైనా స్టార్ ఆదివారం రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు స్థానిక సీఎన్‌టీవీ పేర్కొంది. అయితే అంతకన్నా ముందు శుక్రవారమే సోషల్ మీడి యాలో లీ నా తన అభిమానులకు ఈ విషయం తెలిపే అవకాశం ఉంది. మోకాలి గాయం కారణంగా లీ నా గత జూన్ నుంచి టెన్నిస్‌కు దూరంగా ఉంటోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న తను గతంలో ఫ్రెంచ్ ఓపెన్ (2011), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2014) నెగ్గింది.