ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని గడచిన 70 ఏళ్లలో అధిరోహించిన వేలాది మంది పర్వతారోహకులు సరికొత్త రికార్డులు సృష్టించారు. వీరిలో పలువురు భారతీయులు కూడా ఉన్నారు. గత 70 ఏళ్లలో సుమారు ఏడు వేల మంది పర్వతారోహకులు ఎవరెస్ట్‌ను అధిరోహించారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాలు, మంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, పర్వతారోహణ సంఘం ఈ సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. 2023లో నలుగురు భారతీయులతో సహా దాదాపు 500 మంది పర్వతారోహకులు ఈ ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించారు. న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్‌కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే 8,848.86 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని 1953, మే 29న ఆవిష్కరించారు.
ఎవరెస్ట్ పర్వతాన్ని నేపాలీ భాషలో సాగరమాత అని అంటారు. ఎడ్మండ్-నార్జ్ 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత దాదాపు 7000 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఇప్పటివరకూ 300 మందికి పైగా పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారని అధికారిక సమాచారం. 2023లో మొత్తం 478 మంది పర్వాతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ ఏడాది నలుగురు భారతీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
భారత్‌కు చెందిన యాషి జైన్, మిథిల్ రాజు, సునీల్ కుమార్, పింకీ హారిస్ మే 17న ప్రపంచంలోనే ఎత్తయిన ఈ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. భారత పర్వతారోహకురాలు సుజానే లియోపోల్డినా మే 18న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నంలో మరణించారు. ఈ ఏడాది ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రలో నలుగురు నేపాలీలు, ఒక భారతీయ మహిళ, ఒక చైనీస్ సహా 11 మంది పర్వతారోహకులు మరణించారు. ఎనిమిది మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. 2023లో నేపాల్‌కు చెందిన కమీ రీటా షెర్పా (53) ఎవరెస్ట్ శిఖరాన్ని 28 సార్లు అధిరోహించి, సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.
ఇది కూడా చదవండి: 2023లో భారత్- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి?
Comments
Please login to add a commentAdd a comment