ఆఫ్రికాపై ధూళి కమ్మితే.. భారత్‌లో వర్షం! | Africa, India, rain, dirt, yes ..! | Sakshi
Sakshi News home page

ఆఫ్రికాపై ధూళి కమ్మితే.. భారత్‌లో వర్షం!

Published Wed, Mar 19 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

Africa, India, rain, dirt, yes ..!

రుతుపవనాలపై ప్రభావం చూపుతున్న ధూళి కణాలు


వాషింగ్టన్: ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా ప్రాంతాలపై ధూళి మేఘాలు కమ్ముకుంటే భారత్‌లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయట. భారత్‌కు పశ్చిమ దిక్కున ఉన్న ప్రాంతాలపై గాలిలో ధూళికణాలు పెరగడం వల్ల అక్కడ గాలి బాగా వేడెక్కుతుందని, ఫలితంగా తూర్పు వైపు ప్రయాణించే గాలిలో తేమ శాతం పెరిగి భారత్‌లో వర్షాలు అధికంగా కురుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


అమెరికాలోని పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబోరేటరీ శాస్త్రవేత్తలతో కలిసి ఐఐటీ భువనేశ్వర్‌కు చెందిన వి.వినోజ్ బృందం జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌లో వర్షపాతంపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసిన వినోజ్ బృందం ఈ మేరకు కనుగొంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement