సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మహాకావ్యం రామాయణానికి ఒక్క భారత్‌తోనే కాదు ఆసియాన్ దేశాలతోనూ విడదీయరాని బంధముంది. చరిత్ర, నాగరికతల పరంగా భారత్‌ను ఆసియాన్ దేశాలతో మమేకం చేసింది ఈ ఇతిహాసమే. ఈ విశేషాలు ప్రస్ఫుటించేలా 25–26న ఢిల్లీలో జరిగే భారత్–ఆసియాన్ సదస్సులో ఆయా దేశాలకు చెందిన కళాకారులు రామాయణంలోని కొన్ని ఘట్టాలను ప్రదర్శించనున్నారు.
ఆసియాన్ దేశాల(ఇండోనేసియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, బ్రూనై, మయన్మార్, లావోస్) అధినేతలు ఈ కార్యక్రమాల్ని తిలకించనున్నారు. భారత్–ఆసియాన్ సంబంధాలకు పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి జరిగే గణతంత్ర వేడుకలకు ఆ దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఆసియాన్ దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడంలోనూ రామాయణం దోహదపడింది.
Comments
Please login to add a commentAdd a comment