Forbes Asia
-
ఆసియా.. ఇండియాలోని ధనవంతుల జాబితా
పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆసియా, దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 2025 జనవరి ప్రారంభం నాటికి పోర్బ్స్ ఆసియా(Forbes Asia) కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ(Ambani) మొదటిస్థానంలో నిలువగా, గౌతమ్ అదానీ(Adani) రెండో స్థానంలో ఉన్నారు. ముఖేశ్ అంబానీ మొత్తం సంపద 96.6 బిలియన్ డాలర్లు ఉండగా, గౌతమ్ అదానీ సంపద 62.1 బిలియన్ డాలర్లుగా ఉంది.ఫోర్బ్స్ ప్రకారం 2025 ప్రారంభం నాటికి ఆసియాలోని టాప్ 10 ధనవంతులుముఖేష్ అంబానీ - 96.6 బిలియన్ డాలర్లు (ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్)గౌతమ్ అదానీ - 62.1 బిలియన్ డాలర్లు (ఇండియా, అదానీ గ్రూప్)జోంగ్ షాన్షాన్ - 53.6 బిలియన్ డాలర్లు (చైనా, నోంగ్ఫు స్ప్రింగ్)ప్రజోగో పంగేస్తు - 55.9 బిలియన్ డాలర్లు (ఇండోనేషియా, బారిటో పసిఫిక్ గ్రూప్)తడాషి యానై అండ్ ఫ్యామిలీ - 47.2 బిలియన్ డాలర్లు (జపాన్, ఫాస్ట్ రిటైలింగ్)జాంగ్ యిమింగ్ - 45.6 బిలియన్ డాలర్లు (చైనా, బైడ్‌డ్యాన్స్, టాక్‌టాక్)సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 44.3 బిలియన్ డాలర్లు (ఇండియా, జిందాల్ గ్రూప్)మా హువాటెంగ్ - 43.3 బిలియన్ డాలర్లు (చైనా, టెన్సెంట్ హోల్డింగ్స్)శివ్ నాడార్ - 40 బిలియన్ డాలర్లు (ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్)రాబిన్ జెంగ్ - 37.2 బిలియన్ డాలర్లు (హాంకాంగ్, కాంటెంపరరీ ఆంపరెక్స్ టెక్నాలజీ-సీఏటీఎల్)ఇదీ చదవండి: వడ్డీరేట్ల కోత పక్కా..?ఫోర్బ్స్ ప్రకారం 2025 ప్రారంభం నాటికి ఇండియాలోని టాప్ 10 ధనవంతులుముఖేష్ అంబానీ - 96.6 బిలియన్ డాలర్లు (రిలయన్స్ ఇండస్ట్రీస్)గౌతమ్ అదానీ - 62.1 బిలియన్ డాలర్లు (అదానీ గ్రూప్)సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 44.3 బిలియన్ డాలర్లు (ఓపీ జిందాల్ గ్రూప్)శివ్ నాడార్ - 40 బిలియన్ డాలర్లు (హెచ్‌సీఎల్ టెక్నాలజీస్)రాధాకిషన్ దమానీ - 31.5 బిలియన్ డాలర్లు (డీమార్ట్)ఉదయ్ కోటక్ - 28 బిలియన్ డాలర్లు (కోటక్ మహీంద్రా బ్యాంక్)సునీల్ మిట్టల్ - 27 బిలియన్ డాలర్లు (భారతీ ఎంటర్ప్రైజెస్)లక్ష్మీ మిట్టల్ - 26 బిలియన్ డాలర్లు (ఆర్సెలర్ మిట్టల్)కుమార మంగళం బిర్లా - 25 బిలియన్ డాలర్లు (ఆదిత్య బిర్లా గ్రూప్)అనిల్ అగర్వాల్ - 24 బిలియన్ డాలర్లు (వేదాంత రిసోర్సెస్) -
2024 ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితా
ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా తొమ్మిదవ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 300 మంది యువ పారిశ్రామికవేత్తలు, లీడర్స్, ట్రయల్బ్లేజర్లు ఉన్నారు. వీరి వయసు 30 ఏళ్లకంటే తక్కువ.అండర్ 30 ఆసియా క్లాస్ ఆఫ్ 2024లో ది ఆర్ట్స్, ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్, మీడియా మొదలైన 10 విభాగాల్లో 300 మంది ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్నవారిలో కే-పాప్ గర్ల్, సింగపూర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ వెరోనికా శాంతి పెరీరా, అషియా సిటీకి చెందిన జపాన్ యొక్క అతి పిన్న వయస్కుడైన మేయర్ రియోసుకే తకాషిమా మొదలైనవారు ఉన్నారు."30 అండర్ 30 ఆసియా" జాబితాసియాన్ డాసన్ - ఆస్ట్రేలియా: ది ఆర్ట్స్మెటల్ బ్యాండ్ - ఇండోనేషియా: ఎంటర్టైన్మెంట్ & స్పోర్ట్స్అలీనా నదీమ్ - పాకిస్తాన్ : ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్ఎరికా ఎంగ్ - మలేషియా: మీడియా, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్యూమీ హ్వాంగ్ - సౌత్ కొరియా: రిటైల్ & ఇకామర్స్జు యుయాంగ్ - చైనా: ఎంటర్ప్రైజ్ టెక్నాలజీఅక్షిత్ బన్సల్ & రాఘవ్ అరోరా - ఇండియా: ఇండస్ట్రీ, మాన్యుఫ్యాక్టరింగ్ & ఎనర్జీజాంగ్ జికియాన్ - చైనా: హెల్త్‌కేర్ & సైన్స్భాగ్య శ్రీ జైన్ - ఇండియా: సోషల్ ఇంపాక్ట్జాన్సన్ లిమ్ - సింగపూర్: కన్స్యూమర్ టెక్నాలజీ -
సుచరిత సుమధుర శ్రుతి
విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువును మాత్రమే కాదు... సమాజాన్ని కూడా లోతుగా చదివే వారే ఎంటర్ప్రెన్యూర్లుగా గెలుపు జెండా ఎగరేయగలరని నిరూపించారు ‘కలైడోఫిన్’ కో–ఫౌండర్, సీయివో సుచరిత ముఖర్జీ, ‘అప్నాక్లబ్’ సీయీవో శ్రుతి. తాజాగా... ఫోర్బ్స్ ఆసియా ‘100 టు వాచ్’ వార్షిక జాబితాలో ఆరు భారతీయ కంపెనీలు చోటు చేసుకున్నాయి. వాటిలో ‘కలైడోఫిన్’‘అప్నాక్లబ్’లు ఉన్నాయి.. అయిదుగురు కుటుంబ సభ్యుల పోషణ బాధ్యతను తలకెత్తుకున్న చెన్నైకి చెందిన రమణీ శేఖర్ దినసరి కూలీ. రోజుకు రెండు వందల రూపాయల వరకు సంపాదిస్తుంది. కంటిచూపు కోల్పోవడంతో భర్త ఇంటికే పరిమితం అయ్యాడు. కొడుకు, కూతురు కాస్తో కూస్తో చదువుకున్నారుగానీ ఏ ఉద్యోగమూ చేయడం లేదు. వీరితోపాటు తల్లి పోషణ భారం కూడా తనదే. ఒక విధంగా చెప్పాలంటే నెలాఖరుకు పైసా మిగలడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘కలైడోఫిన్’ పేరు మీద అయిదు వందల రూపాయలు పొదుపు చేయడం మానలేదు రమణి. ‘అత్యవసర పరిస్థితుల్లో వైద్య అవసరాల కోసం ఈ డబ్బును ఉపయోగిస్తాను’ అంటున్న రమణి కొంత డబ్బును సెల్ఫ్–హెల్ప్ గ్రూప్ సేవింగ్ స్కీమ్స్‌లో కూడా పెడుతుంది. ‘రమణిలాంటి ఎంతోమంది పేదవాళ్లకు కష్ట సమయంలో కలైడోఫిన్ అండగా ఉంది’ అంటుంది ఫిన్‌టెక్ కంపెనీ ‘కలైడోఫిన్’ కో–ఫొండర్, సీయీవో సుచరిత ముఖర్జీ. దీర్ఘకాల, మధ్యకాల, స్వల్పకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఉదాన్, లక్ష్య, ఉమ్మిద్ అనే ప్యాకేజ్‌లను లాంచ్ చేసింది కలైడోఫిన్. ‘కలైడోఫిన్’ ప్యాకేజిలలో ఒకటైన ‘లక్ష్య’ను పేద ప్రజల ఆరోగ్యం, చదువు, వివాహాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు నుంచి నాలుగు సంవత్సరాల కాలపరిమితితో రూపొందించారు. ఈ ప్యాకేజీలో మరణం లేదా అంగవైకల్యానికి బీమా ఉంటుంది. ‘తమ ఆర్థిక స్థాయిని బట్టి ఎవరైనా సరే వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసులతో యాక్సెస్ కావచ్చు’ అంటూ దిగువ మధ్యతరగతి, పేదవర్గాలకు భరోసాతో బయలుదేరింది కలైడోఫిన్. చెన్నై కేంద్రంగా ప్రారంభమైన ఈ ఫిన్‌టెక్ కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. వ్యాపారవేత్తకు కేవలం వ్యాపార దృష్టి మాత్రమే కాదు సాధ్యసాధ్యాలకు సంబంధించి వినియోగదారుల దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. ఈ విషయంలో తగిన అధ్యయనం చేసింది సుచరిత. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో డిగ్రీ, ఐఐఎం, అహ్మదాబాద్‌లో ఎంబీఎ చేసిన సుచరిత ఐఎఫ్ఎంఆర్ ట్రస్ట్ గ్రూప్ కంపెనీలలో ఉన్నత హోదాలలో పనిచేసింది. ఆ తరువాత ‘కలైడోఫిన్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం ప్రారంభించింది. శ్రుతి తండ్రి ఐఏఎస్ అధికారి. అయినప్పటికీ ఆయనకు ఆడపిల్లల విషయంలో ‘అయ్యో!’లు తప్పలేదు. ‘పాపం ఆయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని లేని బాధను కొని తెచ్చుకునేవారు చుట్టాలు, పక్కాలు. స్కూల్ నుంచి కాలేజీ రోజుల వరకు ఎన్నోసార్లు లింగవివక్షతను ఎదుర్కొంది శ్రుతి. ఆత్మవిశ్వాసం ఉన్నా తప్పే లేకున్నా తప్పే అన్నట్లుగా ఉండేది పరిస్థితి. ఆత్మవిశ్వాసం ఉంటే ‘అంత వోవర్ కాన్ఫిడెన్సా?’ అని వెక్కిరింపు. లేకపోతే‘అంత ఆత్మన్యూనతా!’ అని చిన్నచూపు. ఇలాంటి పరిస్థితులను తట్టుకొని పెద్ద ప్రయాణమే చేయాల్సి వచ్చింది శ్రుతి. అయితే ఆ ప్రయాణంలో ఆమె ఎప్పుడూ ఆగిపోలేదు. ఐఐటీ–దిల్లీలో ఎం.టెక్. పూర్తిచేసిన శ్రుతి ఉద్యోగం చేయాలనుకుంది. ఆ తరువాత ‘ఉద్యోగం చేయగలనా?’ అని కూడా అనుకుంది. దీనికి కారణం... తన స్వతంత్ర వ్యక్తిత్వం. ‘నీకు చాలా కోపం’ అనే మాట చాలాసార్లు విన్నది.‘ఆవేశంతో కనిపించే వాళ్లకు సాధించాలనే కసి ఎక్కువగా ఉంటుంది’ అనే మాట కూడా విన్నది. ‘అప్నాక్లబ్’ రూపంలో అది తన విషయంలో నిజమైంది. వ్యాపారంలో రాణించాలనుకున్న శ్రుతి హార్వర్డ్ బిజినెస్ స్కూల్(హెచ్‌బీఎస్)లో ఎంబీఏ చేసింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్’ పేరుతో ట్రావెల్ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. అయితే అది తనకు చేదు అనునుభవాన్ని నేర్పించడమే కాకుండా తియ్యటి పాఠాలు నేర్పింది. చిన్న పట్టణాలకు చెందిన వాళ్లు ఎఫ్ఎంసీజీ(ఫాస్ట్–మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రాడక్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారనే విషయం గ్రహించిన శ్రుతి ‘అప్నాక్లబ్’ పేరుతో ఎఫ్ఎంసీజీ హోల్‌సేల్ ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టింది. సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘ఫరవాలేదు’ అనుకుంటున్న సమయంలో కంపెనీ వేగంగా దూసుకుపోవడం మొదలైంది. టైగర్ గ్లోబల్, ట్రూ స్కేల్ క్యాపిటల్, ఫ్లోరిష్ వెంచర్స్, వైట్‌బోర్డ్ క్యాపిటల్... బ్యాకర్స్గా ‘అప్నాక్లబ్’ శక్తిమంతంగా తయారైంది. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతోంది. ‘నీకున్న ఆవేశానికి ఉద్యోగం చేయడం కష్టం. వ్యాపారం చేయడం అంత కంటే కష్టం’ అనే మాటను ఎన్నోసార్లు విన్నది శ్రుతి. ఇప్పుడు అలాంటి మాటలు ముఖం చాటేశాయి. ‘ఏదో సాధించాలనే గట్టి తపన, సంకల్పబలం ఉన్న మహిళ’ అనే ప్రశంసపూర్వకమైన మాటలు ‘అప్నాక్లబ్’ సీయీవో శ్రుతి గురించి తరచు వినిపిస్తున్నాయి. -
Asia Power Businesswomen List 2022: పవర్‌కు కేరాఫ్ అడ్రస్
‘అవకాశం అనేది మీ తలుపు తట్టకపోతే కొత్త తలుపు తయారు చేసుకోండి’ అనే మాట ఉంది. అవును. కొత్తగా ఆలోచించినప్పుడు మాత్రమే కొత్తశక్తి వస్తుంది. ఆ శక్తి ఈ ముగ్గురు మహిళలలో ఉంది. ‘ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్’ జాబితాలో చోటు సంపాదించిన గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్ల గురించి... ఫోర్బ్స్ ‘ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్’ జాబితాలో మన దేశానికి చెందిన గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్లు చోటు సంపాదించారు. కోవిడ్ కష్టాలు, నష్టాలను తట్టుకొని తమ వ్యాపార వ్యూహాలతో సంస్థను ముందుకు తీసుకెళ్లిన వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు. ‘హొనాసా కన్జూమర్’ కో–ఫౌండర్ గజల్ అలఘ్ చండీగఢ్‌లోని ఉమ్మడి కుటుంబంలో పెరిగింది. ఆ పెద్ద కుటుంబంలో మహిళల నోట ఉద్యోగం అనే మాట ఎప్పుడూ వినిపించేది కాదు. అయితే తల్లి మాత్రం గజల్‌కు ఆర్థిక స్వాత్రంత్యం గురించి తరచు చెబుతుండేది. పదిహేడు సంవత్సరాల వయసులో కార్పోరేట్ ట్రైనర్‌గా తొలి ఉద్యోగం చేసిన గజల్ ఆ తరువాత కాలంలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, ఇన్నోవేటర్ అండ్ ఇన్వెస్టర్‌గా పేరు తెచ్చుకుంది. ప్రణాళికాబద్ధంగా పని చేయడం తన విజయరహస్యం. మూడురోజుల తరువాత చేయాల్సిన పని అయినా సరే ఈ రోజే పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. ధ్యానంతో తన దినచర్య మొదవుతుంది. కోవిడ్ ఉధృతి సమయంలో వ్యాపారం కుప్పకూలిపోయింది. అందరిలో భయాలు. ఆ భయం ఆఫీసు దాటి ఇంట్లోకి కూడా వచ్చింది. తల్లిదండ్రుల మౌనం పిల్లలపై పడింది. దీంతో వెంటనే మేల్కొంది గజల్. సరదాగా భర్త, పిల్లలతో యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ఇంట్లో మళ్లీ సందడి మొదలైంది. ఆ ఉత్సాహవంతమైన సందడిలో విచారం మాయమై పోయింది. తన సరికొత్త వ్యూహాలతో వ్యాపారం పుంజుకుంది. ‘విచారంలో మునిగిపోతే ఉన్న కాస్తో కూస్తో ఆశ కూడా మాయమైపోతుంది. పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. ఇలాంటి సమయంలోనే మానసికంగా గట్టిగా ఉండాలి’ అంటుంది గజల్. ‘ఎమ్క్యూర్ ఫార్మా’ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్ రచయిత్రి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోచ్, యూ ట్యూబ్ టాక్‌షో ‘అన్కండీషన్ యువర్సెల్ఫ్ విత్ నమితా థాపర్’ నిర్వాహకురాలు. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్న నమితా ‘థాపర్ ఎంటర్ప్రెన్యూర్ అకాడమీ’ ద్వారా ఎంతోమంది ఔత్సాహికులకు విలువైన పాఠాలు చెబుతోంది. తన తాజా పుస్తకం ‘ది డాల్ఫిన్ అండ్ ది షార్క్: లెస్సెన్స్ ఇన్ ఎంటర్ప్రెన్యుర్షిప్’కు మంచి ఆదరణ లభించింది. ‘ప్రపంచం కోసం నువ్వు మారాలని ప్రయత్నించకు. నువ్వు నీలాగే ఉంటే ప్రపంచమే సర్దుబాటు చేసుకుంటుంది’ ‘నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ద్వారా మాత్రమే నీలోని శక్తి నీకు కనిపిస్తుంది’...ఇలాంటి ఉత్తేజకరమైన వాక్యాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ‘మొదట్లో నాలో ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. లావుగా ఉండడం వల్ల చిన్నప్పుడు తోటి పిల్లలు వెక్కిరించేవారు. వారి మాటలను సీరియస్‌గా తీసుకొని ఉంటే నిస్పృహ అనే చీకట్లోనే ఉండేదాన్ని. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం పట్టింది. ఆ తరువాత మాత్రం ఆత్మ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు’ అంటుంది నమితా థాపర్. భువనేశ్వర్‌కు చెందిన సోమా మండల్ చదువులో ఎప్పుడూ ముందుండేది. తాను ఇంజనీరింగ్‌లో చేరడానికి తండ్రి ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్‌లాంటి వృత్తులు అమ్మాయిలు చేయలేరు అని ఆయన అనుకోవడమే దీనికి కారణం. అయితే కుమార్తె పట్టుదలను చూసి తండ్రి తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్న సోమా మండల్ అల్యూమినియం తయారీ సంస్థ ‘నాల్కో’లో ట్రైనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తొలి మహిళా చైర్‌పర్సన్‌గా చరిత్ర సృష్టించింది. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించి జేజేలు అందుకుంది. -
ఆకాశమంత: రూ. 5600 పెట్టుబడితో.. 500 మిలియన్ల టర్నోవర్ స్థాయికి..
మనదేశంలోని విమానయాన సంస్థల్లో అత్యంత పెద్దదైన సంస్థ జెట్‌సెట్‌గో. దీనిని స్థాపించింది ఓ మహిళ. పేరు కనికా టేక్రీవాల్. పదేళ్ల కిందట స్థాపించిన ఆ సంస్థ ఇప్పుడు ఐదు వందల మిలియన్ల టర్నోవర్‌తో నడుస్తోంది. ఐదేళ్ల కిందట ఫోర్బ్స్ అండర్ థర్టీ విభాగంలో ఆసియాలో ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ కనికా టేక్రీవాల్. కనికా టేక్రీవాల్ది భోపాల్‌కు చెందిన మార్వారీ వ్యాపార కుటుంబం. ఈ కుటుంబానికి దేశవ్యాప్తంగా మారుతీ డీలర్షిప్ ఉంది. కనిక తండ్రి అనిల్ టేక్రీవాల్ ఉమ్మడి కుటుంబం భాగాలు పంచుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. తల్లి సునీత గృహిణి. కనిక ఆమె తమ్ముడు కనిష్క్... ఇదీ వాళ్ల చిన్న కుటుంబం. మంచి చదువు కోసం అనే కారణం గా సొంతూరికి 17 వందల కిలోమీటర్ల దూరాన ఉన్న ఊటీకి వచ్చి పడిందామె బాల్యం. పదవ తరగతి తర్వాత తిరిగి భోపాల్‌కి వెళ్లి పన్నెండు వరకు అక్కడే చదివింది. ఆ తర్వాత ముంబయిలోని బీడీ సోమాని ఇన్స్టిట్యూట్లో విజువల్ కమ్యూనికేషన్ అండ్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ‘ముంబయి తనకు జీవించడం నేర్పించింది’ అంటోంది కనిక కాలేజ్ రోజులను తలుచుకుంటూ. కారు నుంచి బస్సుకు ‘‘గ్రాడ్యుయేషన్‌కి ముంబయిలో హాస్టల్లో ఉన్నప్పుడు మా నాన్న నాకు పాకెట్ మనీ చాలా తక్కువగా కచ్చితంగా లెక్కపెట్టినట్లు ఇచ్చేవారు. చేతిలో డబ్బు ఎక్కువ ఉంటే వ్యసనాలకు అలవాటు పడతానని నాన్న భయం. ఈ నేపథ్యంలో ముంబయి నగరం నాకు జీవించడం నేర్పించింది. అప్పటివరకు నేను చూసిన జీవితంలో నేను బయటకు వెళ్లడానికి ఇంట్లో నుంచి కాలు బయటపెడితే ఏ కారు అడుగుతానోనని మా డ్రైవర్లు నా చుట్టూ మూగేవాళ్లు. హాస్టల్లో ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి సిటీబస్‌లో ప్రయాణించడం మొదలుపెట్టాను. నాన్న నెలకు ఒక సినిమాకు డబ్బిస్తే మేము నాలుగు సినిమాలు చూడాలి కదా మరి. అందుకే ఆ పొదుపు. కొన్నాళ్లకు అది కూడా కాదని నెలకు మూడు వందల రూపాయలకు పార్ట్‌టైమ్ వర్క్ మొదలుపెట్టాను. జీవితంలో అత్యంత సంతోషం అప్పుడు కలిగింది. సొంత సంపాదన ఇచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. ఆ డబ్బును ఖర్చు చేయబుద్ధి కాలేదు. అందుకే మా అమ్మకిచ్చాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి యూకేకి వెళ్లాను. ఎంబీఏ చేస్తూ ఏరోస్పేస్ రీసోర్సెస్లో ఉద్యోగం చేశాను. క్యాన్సర్ పరీక్ష పీజీతోపాటు చదువులో పరీక్షలన్నీ పూర్తయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లు ఎందుకో తెలియదు కానీ అమ్మానాన్నల దగ్గర ఉందామనిపించింది. నా ఎదురుగా మరో పరీక్ష ఉందని ఇండియాకి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పటికే నన్ను క్యాన్సర్ పీడిస్తోంది. ట్రీట్మెంట్ సమయమంతా మోటివేషనల్ బుక్స్ చదవడానికే కేటాయించాను. లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవితం నాకు స్ఫూర్తినిచ్చింది. ఒక సైక్లిస్ట్ క్యాన్సర్‌తో పోరాడి తిరిగి ట్రాక్‌లో పోటీపడడం నాకు ధైర్యాన్నిచ్చింది. నన్ను నేను దృఢంగా మార్చుకోవడానికి బాగా ఉపయోగపడింది. పన్నెండు కీమో థెరపీలు, రేడియేషన్ల తర్వాత మామూలయ్యాను. అప్పటికి నా వయసు 23. ఆ తర్వాత ఏడాది అంటే 2012లో జెట్‌సెట్‌గో ప్రారంభించాను. ఆరోగ్యరీత్యా ఇంతపెద్ద వెంచర్‌ను తలకెత్తుకోవడానికి ఎవరూ ప్రోత్సహించలేదు. ‘ఏమీ చేయకుండా ఊరుకోవడం ఇష్టం లేకపోతే బేకరీ పెట్టి కప్‌కేక్స్ చేసుకోవచ్చు కదా’ అని నిరుత్సాహపరిచిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనమేం చేయాలనేది మనమే నిర్ణయించుకోవాలి. ఆ అవకాశం ఇతరులకు ఇవ్వకూడదు. సామాన్యులకూ సాధ్యమే! జెట్‌సెట్‌గోలో నా తొలి పెట్టుబడి 5,600 మాత్రమే. ఆ డబ్బుతో యాప్ తయారు చేసుకున్నాను. చార్టెడ్ ఫ్లయిట్స్‌ను బుక్ చేసుకోగలిగిన యాప్ అది. రెండేళ్ల పాటు క్లయింట్ల నుంచి అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవడంతోపాటు వెండర్స్ నుంచి హైర్ చేసి వ్యాపారం నిర్వహించాను. అద్దె హెలికాప్టర్లతో మొదలైన వ్యాపారం 2020కి ఎనిమిది సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 200 మంది ఉద్యోగులు, 15 కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. మా సర్వీస్ ద్వారా 2020–21 ఆరువేల ఫ్లైట్లతో లక్ష మంది ప్రయాణించారు. మా క్లయింట్లలో సాధారణంగా కార్పొరేట్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులే ఉంటారు. ఢిల్లీ – ముంబయి, ముంబయి – బెంగళూరు, హైదరాబాద్ – ఢిల్లీలకు ప్రయాణించేవాళ్లు ఎక్కువ. మా క్లయింట్ అవసరాన్ని బట్టి ఆరు సీట్ల చార్టర్ ఫ్లైట్ నుంచి 18 సీట్ల ఫ్లయిట్ వరకు అందించగలుగుతాం. మెడికల్ ఎమర్జెన్సీలు కూడా ఉంటాయి. మనదేశంలో ఉన్న ప్రైవేట్ చార్టర్ కంపెనీలలో మాది బెస్ట్ ప్రైవేట్ చార్టర్. ఈ స్థాయికి చేరిన తర్వాత ముంబయిలో ఓ ప్రయోగం చేశాం. హెలికాప్టర్లో ప్రయాణించాలనే సరదా చాలామందిలో ఉంటుంది. కానీ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లడానికి అంత ఖర్చు చేసి చార్టర్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. హెలికాప్టర్లో విహరించాలనే సరదా బలంగా ఉంటుంది. అలాంటి వాళ్ల కోసమే ఈ షటిల్ సర్వీస్ ప్రయోగం. నగరంలో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లి రావచ్చన్నమాట. అది కూడా ఊబెర్ సర్వీస్‌లో ముంబయిలో ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లి వచ్చిన ఖర్చులోనే. దూరాన్ని బట్టి కనీసం వెయ్యి నుంచి గరిష్టంగా రెండున్నర వేల రూపాయలుగా నిర్ణయించాం. మాది ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ అన్నమాట. భవిష్యత్తులో ఇది బాగా పాపులర్ అవుతుందని కచ్చితంగా చెప్పగలను’’ అంటోంది కనిక. ఆ హక్కు నాకు లేదు ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను గర్వంగా చెప్పుకోగలిగిన విషయం ఏమిటంటే... కోవిడ్ సమయంలో ఉద్యోగులను తగ్గించడం కానీ, జీతాల్లో కోత విధించడం కానీ చేయలేదు. నేను మా ఉద్యోగుల కు సంస్థ లాభాల్లో భాగస్వామ్యం ఎప్పుడూ ఇవ్వలేదు. కాబట్టి మా నష్టాలను వాళ్లను కొంత పంచుకోమని అడగడం అనైతికం. యజమానిగా నేను నష్టంలో ఉన్న కారణంగా ఉద్యోగుల జీతంలో కోత విధించే హక్కు నాకు ఉండదు. – కనికా టేక్రీవాల్, జెట్‌సెట్‌గో ఫౌండర్ -
అమ్మాయిల్లో విభిన్నం.. ఈ విభా!
మనకేదైనా ఆరోగ్య సమస్య ఎదురైన వెంటనే డాక్టర్ల దగ్గరకు పరుగెత్తుకెళ్లి్ ట్రీట్మెంట్ చేయించుకుని వారు చెప్పిన విధంగా మందులు వాడతాం. ఒకసారి సమస్య తీరితే అక్కడితో ఆవిషయాన్ని మర్చిపోతాం. బెంగళూరుకు చెందిన 25 ఏళ్ల విభా హరీష్ మాత్రం అలా చేయలేదు. తనకు వచ్చిన ఆరోగ్య సమస్యకు డాక్టర్లు ఇచ్చిన మందులు ఎలా పనిచేస్తున్నాయో జాగ్రత్తగా పరిశీలించి, వాటి పనితీరు నచ్చడంతో ఏకంగా ఒక మందుల తయారీ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడుపుతోంది. దీంతో తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన ఏసియా అండర్ 30 జాబితాలో విభా హరీష్‌కు చోటు దక్కింది. విభా హరీష్ ఇంటర్మీడియట్ చదువుతుండ గా తనకి పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పీసీఓఎస్ నుంచి బయటపడేందుకు ఆయుర్వేద మెడిసిన్ బాగా పనిచేస్తుందని విభా వాళ్ల అమ్మ చెప్పడంతో.. ఆయుర్వేద మందులు వాడడం ప్రారంభించి అవి ఎలా పనిచేస్తున్నాయో చాలా జాగ్రత్తగా పరిశీలించేది. ఈ క్రమంలో తన పీసీఓఎస్ సమస్య పూర్తిగా నయం అయిన తరువాత.. ఆయుర్వేద మెడిసిన్స్ గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి విభాకు కలగడంతో..∙వివిధ రకాల సమస్యలకు ఆయుర్వేద మందులు ఎలా పనిచేస్తున్నాయో తన మీదే ప్రయోగించి తెలుసుకునేది. అలా ఆయుర్వేద ప్రాముఖ్యాన్ని గుర్తించి ‘కాస్మిక్స్’ అనే ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. జీర్ణ వ్యవస్థ, కాలేయం, చర్మం, నిద్రలేమి, కేశ సంరక్షణకు సంబంధించి ఎనిమిది రకాల హెర్బల్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. కాస్మిక్స్ ప్రారంభించిన ఏడాది కాలంలోనే రెండు కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఇంజినీరింగ్ చదువుతోన్న విభా మూలికా వైద్యం గురించి మరింత తెలుసుకోవడానికి ఆయుర్వేద ఔషధాలపై అధ్యయనం చేస్తోంది. విభా తన తల్లి ప్రోత్సాహంతో కాస్మిక్స్ సంస్థను విజయపథంలో నడిపిస్తోంది. విభా తల్లి హోమియోపతిలో శిక్షణ తీసుకోవడం వల్ల కాస్మిక్స్లో తయారయ్యే ఉత్పత్తులను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విభా తన కంపెనీకి వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మంచి ఆహారాన్ని అందించేందుకు ఖర్చు చేస్తుండడం విశేషం. విభా మాట్లాడుతూ..‘‘నాకు పీసీఓఎస్ ఎదురైనప్పుడు దానినుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేశాను. ఇందులో భాగంగా ..పీసీఓస్ గురించిన సమాచారం కోసం నెట్లో తీవ్రంగా వెదికేదాన్ని. ఆ సమయంలో చాలా మంది ఏం తినాలి? ఎటువంటి వ్యాయామాలు చేయాలి అనే దానిపై విభిన్న అభిప్రాయాలను చదివాను. వాటిలో ఏది కరెక్ట్, మనకు కచ్చితంగా పనిచేసేది ఏంటో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. రకరకాల ప్రయత్నాల తరువాత మా అమ్మ సలహా మేరకు ఆయుర్వేదం మందులు వాడాను. అవి నాకు బాగా పనిచేశాయి. దీంతో నాలాగా ఇబ్బంది పడుతున్నవారికి ఇవి అందించాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో నేను ఆయుర్వేద మూలికలు గురించి లోతుగా తెలుసుకుని నాకు ఆయుర్వేదంపై ఒక అవగాహన వచ్చిన తరువాత కాస్మిక్స్ సంస్థను ప్రారంభించాను. పూర్తిగా ప్రకృతిసిద్ధమైన ఉత్పత్తులు కావడంతో మంచి స్పందన వచ్చింది. ఒక సంవత్సర కాలంలోనే కాస్మిక్స్ ఈ స్థాయికి చేరుకుంది. ఫోర్బ్స్ ఏసియా అండర్ 30 జాబితాలో నా పేరు కూడా ఉండడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని విభా చెప్పింది. -
ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు హైదరాబాదీలు
హైదరాబాద్: "ఫోర్బ్స్ 30 అండర్ 30" ఆసియా జాబితాలో ఇద్దరు యువ హైదరాబాదీలు స్థానం సంపాదించారు. హైదరాబాద్ నగరానికి చెందిన మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రణవ్ వెంపతి, డీజీ-ప్రిక్స్ వ్యవస్థాపకుడు సమర్థ్ సింధీ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అతని మేకర్స్ హైవ్ సంస్థ కృత్రిమ అవయవాలను తయారు చేస్తుంది. ఈ అంకుర సంస్థ ‘కల్ఆర్మ్’ అనే పేరుతో బయోనిక్ హ్యాండ్ తయారు చేసి, చాలా తక్కువ ధరకు అందిస్తోంది. ఈ కృత్రిమ చేత్తో టైపింగ్ సహా అన్ని రకాల పనులు చేయొచ్చు. డీజీ-ప్రిక్స్ ఆన్లైన్ ఫార్మసీ సేవల సంస్థ. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులను మందులను హోమ్ డెలివరీ చేస్తారు. వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా తమ ప్రిస్క్రిప్షన్లను అప్లోడ్ చేసిన రోగులకు నెలవారీ మందులను డెలివరీ చేయడానికి హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ పనిచేస్తుంది. డెలివరీ ఉచితం, ఔషధ ధరలు స్థానిక ఫార్మసీల కంటే 15 శాతం వరకు చౌకగా ఉంటాయి. ఎందుకంటే డిజి-ప్రీక్స్ ఆర్డర్లు ఇవ్వడానికి పంపిణీదారులతో నేరుగా కలిసి పనిచేస్తుంది. ఈ సంస్థ రెండేళ్ల క్రితం ఖోస్లా వెంచర్స్, వై కాంబినేటర్, జస్టిన్ మతీన్ నుంచి 5.5 (దాదాపు రూ.40 కోట్లు) బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. సమర్థ్ సింధీ బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. భారతదేశానికి తిరిగి రాకముందు అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ కంపెనీలో పనిచేశాడు. చదవండి: ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి! -
ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్ యువకులు
సాక్షి, హైదరాబాద్: ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన ‘30 అండర్ 30’ఆసియా జాబితాలో చోటు సంపాదించుకున్న ఐదుగురు హైదరాబాద్ యువకులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం అభినందించారు. ఆసియా ఖండం వ్యాప్తంగా 30 ఏళ్ల లోపు వయసున్న 30 మందిని ఫోర్బ్స్ గుర్తించగా.. ఈ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువ పారిశ్రామికవేత్తలకు చోటుదక్కింది. ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన ప్రేమ్ కుమార్ (మారుత్ డ్రోన్స్), అశ్విన్ మోచర్ల (దీ థిక్ షేక్ ఫ్యాక్టరీ), సందీప్ బొమ్మి (యాడ్ ఆన్ మో), విహారి (అర్బన్ కిసాన్), పవన్ కుమార్ చందన (స్కై రూట్ ఏరోస్పేస్) పేర్లతో స్టార్టప్‌లను స్థాపించారు. ప్రస్తుత తరంలోని యువకులు తమ ఆలోచనలకు అనుగుణంగా అద్భుతమైన ఆవిష్కరణలు, వినూత్న మార్గాల్లో పురోగమిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయసహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్, వీ హబ్ వంటి కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ నగర స్టార్టప్ వాతావరణం బలోపేతమైందని పేర్కొన్నారు. కాగా ఈ ఐదుగురు పారిశ్రామికవేత్తలు ఆయా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపారు. అలాగే వీరు స్థాపించిన కంపెనీలకు ఫండింగ్‌తో పాటు అనేక అవార్డులు కూడా లభించాయి. ఇందులో పలు స్టార్టప్‌లు టీ హబ్ ద్వారా ప్రారంభమవ్వడం లేదా టీ హబ్ ద్వారా సహాయ సహకారాలు అందుకున్నవి కావడం గమనార్హం. -
‘ఫోర్బ్స్’ జాబితాలో నగర సైంటిస్ట్
సాక్షి,సిటీబ్యూరో: నగరానికి చెందిన యువ శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 లిస్ట్‌లో చోటు దక్కింది. కవాడిగూడ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్ గోరకవి 16 ఏళ్లుగా వినూత్న పరిశోధనలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. సైన్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఆయన చేసిన పరిశోధనలకు ఫోర్బ్స్ ఈ గుర్తింపునిచ్చింది. ఆయన సృజన నుంచి రూపుదిద్దుకున్న ‘ది పై ఫ్యాక్టరీ’ స్టార్టప్ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఙానాన్ని అందిస్తోంది. ఈ సంస్థ రూపొందించిన లైట్ వెయిట్ పేపర్‌బోర్డ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆయన రూపొందించిన ప్యాకేజింగ్ మెకానిజం, లిక్విడ్ జెట్టింగ్ మెకానిజం, సాఫ్ట్ హ్యాండ్స్, లైట్ వెయిట్ ప్యాకేజింగ్ మెటీరియల్, దోశ ప్రీమిక్స్ ఫార్ములేషన్, హోలోగ్రాఫిక్ ఇంక్, ఆర్థోపెడిక్ క్యాథ్టర్, సాచెట్ మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్, వాటర్ ప్యూరిఫికేషన్ డివైజ్, మల్టీ కలర్ నెయిల్ పెయింటర్, ఆర్టిఫీషియల్ లింబ్, లేక్వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్ వంటివి పలు అవార్డులను తెచ్చిపెట్టాయి. ప్రవీణ్ కుమార్ ఇప్పటి వరకు ఫ్యాప్సీ అవార్డు, నేషనల్ సైన్స్ మెడల్, గవర్నర్ అప్రిషియేషన్ అవార్డు వంటి జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకున్నారు. -
ఫోర్బ్స్ జాబితాలో అనుష్క, సింధు
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియాలో 30 సంవత్సరాల వయసులోపున్న వివిధ రంగాల్లో సత్తా చాటిన 300 మంది ఎంటర్ప్రెన్యూర్లు, ఇన్నోవేటర్ల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఆసియా 30 అండర్ 30 -2018 పేరిట ప్రకటించిన ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధులకు చోటుదక్కింది. వినోద, వాణిజ్య, వెంచర్ క్యాపిటల్, రిటైల్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్లు వంటి పలు రంగాల నుంచి పలువురిని ఫోర్బ్స్ ఎంపిక చేసింది. ఇంకా ఈ జాబితాలో భారత్ నుంచి మోడల్ భూమికా అరోరా, సైనప్ సీఈఓ అశ్విన్ రమేష్, అథ్లెట్ శ్రుతి మంథన, హేడేకేర్ ఫౌండర్ దీపాంజలి దాల్మియా, హెల్త్‌సెట్‌గో ఫౌండర్ ప్రియా ప్రకాష్ వంటి యువ వాణిజ్యవేత్తలు, టెక్నోక్రాట్లున్నారు. -
ఆసియా సంపన్న కుటుంబాల్లో 14 భారత్‌వే!
సింగపూర్: ఫోర్బ్స్ ఆసియా ప్రాంత 50 సంపన్న కుటుంబాల జాబితాలో 14 భారత్ నుంచే ఉన్నాయి. ఈ జాబితాలో 21.5 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ కుటుంబం మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే జాబితాలో 17 బిలియన్ డాలర్ల సంపదతో ప్రేమ్‌జీ కుటుం బం 7వ స్థానంలో, 14.9 బిలియన్ డాలర్ల సంపదతో మిస్త్రీ కుటుంబం 10వ స్థానంలో నిలిచా యి. 11.4 బిలియన్ డాలర్ల సంపదతో గోద్రేజ్ కుటుంబం 15వ స్థానంలో, 10 బిలియన్ డాలర్లతో మిట్టల్ కుటుంబం 19వ స్థానంలో, 7.8 బిలియన్ డాలర్ల సంపదతో బిర్లా వారు 22వ స్థానంలో, 5.6 బిలియన్ డాలర్ల సంపదతో బజాజ్ కుటుంబం 29వ స్థానంలో, 5.5 బిలియన్ డాలర్ల సంపదతో డాబర్ ఇండియా బర్మన్స్ కుటుంబం 30వ స్థానంలో ఉన్నాయి.