
సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ షేర్లకు పీఎన్‌బీ మెగా స్కాం సెగ తగిలింది. దీంతో ఫైనాన్షియల్ సంస్థలు,బ్యాంకింగ్ షేర్లలో సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. అలాగే మెటల్, ఆటో రంగాల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఒక్క ఐటీ,పార్మ తప్ప అన్ని సెక్టార్లలో నష్టాలే. దీంతో ఒక దశలో సెన్సెక్స్ 330పాయింట్లు పతనమై 34వేల దిగువకు చేరింది. చివరకు వారాంతంలో సెన్సెక్స్ 287పాయింట్ల పతనంతో 34, 010వద్ద, నిఫ్టీ 93 93 పాయింట్ల నష్టంతో 10452 వద్ద ముగిసింది.
ఎస్‌బీఐ, పీఎన్‌బీ,బీఓబీ, కెనరా బ్యాంకు, ఆంధ్రా, ఐసీఐసీఐ,యస్‌బ్యాంక్‌తోపాటు ఐషర్, ఐబీ హౌసింగ్, వేదాంతా, భారతీ, మారుతీ, టాటా స్టీల్, మదరన్ సుమీ భారీగా నష్టపోయాయి. అంబుజా, కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, మైండ్ ట్రీ స్వల్పంగా లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment