పంజాబ్ నేషనల్ బ్యాంకు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణాలు తవ్వే కొద్దీ బయటికి వస్తున్నాయి. నీరవ్ మోదీ కుంభకోణం అనంతరం మరో స్కాం వెలుగులోకి వచ్చింది. ముంబై బ్రాంచ్‌లో మరో 9.1 కోట్ల రూపాయల మోసం జరిగినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు గుర్తించింది. ఈ విషయంపై ఫెడరల్ పోలీసు వద్ద పీఎన్‌బీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నీరవ్ మోదీ పాల్పడిన మాదిరిగానే.. అధికారుల సహకారంతో చంద్రీ పేపర్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీ కూడా ఈ కుంభకోణానికి పాల్పడినట్టు వెల్లడైంది. అయితే ఈ స్కాంపై ఇటు పీఎన్‌బీ అధికార ప్రతినిధి కానీ, అటు చంద్రీ పేపర్ కానీ వెంటనే స్పందించలేదు. ఈ స్కాంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగ, గత నెలలో వెలుగులోకి వచ్చిన నీరవ్ మోదీ కుంభకోణంలో పీఎన్‌బీ ముంబై బ్రాంచ్‌లో దాదాపు రూ.12,700 కోట్ల అవకతవకలు జరిగినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ స్కాం బయటికి రాకముందే, ఈ భారీ మోసానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చౌక్సి, కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోయారు. వీరిని ప్రస్తుతం భారత్‌కు రప్పించడానికి దర్యాప్తు సంస్థలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మోదీ, చౌక్సిలకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని ఇంటర్‌పోల్‌ను కూడా కోరుతోంది ఈడీ.
Comments
Please login to add a commentAdd a comment