సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ భ్యాంకు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాను విక్రయ నిర‍్ణయాన్ని పూర్తి చేయనుంది. జనరల్ అట్లాంటిక్, వర్డె పార్టనర్స్ సంస్థలకు రూ. 1851 కోట్లకు విక్రయించనున్నామని పీఎన్‌బీ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. అయితే హౌసింగ్ యూనిట్‌లో ప్రమోటర్ హోదా ఉంటుందని బ్యాంకు తెలిపింది.
ఇందులో భాగంగా ఇరు సంస్థలు 1.09 కోట్ల పీఎన్‌బీ హౌసింగ్ షేర్లను రూ. 850 చొప్పున కొనుగోలు చేస్తాయి. ఈ విలువ ప్రకారం పీఎన్‌బీ హౌసింగ్ మొత్తం విలువ రూ. 926 కోట్లకు చేరుతుంది. ఈ విక్రయం అనంతరం పీఎన్‌బీకి హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటా 32.79 శాతం నుంచి 19.78 శాతానికి దిగిరానుంది. హౌసింగ్ యూనిట్‌లో వాటాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని గత డిసెంబర్‌లో పీఎన్‌బీ నిర్ణయించింది. ఈ ప్రకటనతో శుక్రవారం మార్కెట్‌లో పీఎన్‌బీ హౌసింగ్ ఫిన్ షేర్ దాదాపు 4శాతం లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment