PNB Housing Finance
-
పీఎన్బీ హౌసింగ్ ‘రోష్ని’ శాఖలు
న్యూడిల్లీ: అందుబాటు ఇళ్ల రుణాల కోసం హైదరాబాద్‌తోపాటు టైర్ 2, 3 పట్టణాల్లో ‘రోష్ని’ శాఖలను ప్రారంభించినట్టు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటించింది. ఈ శాఖల ద్వారా తమ కస్టమర్ల బేస్‌ను పెంచుకోనున్నట్టు తెలిపింది. రోష్ని అన్నది పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ అమలు చేస్తున్న రుణ పథకం. అందరికీ ఇళ్లు అన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. ఈ పథకం కింద రిటైల్ కస్టమర్లకు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ రూ.5 నుంచి రూ.30 లక్షల మధ్య రుణాలను మంజూరు చేస్తుంటుంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
పీఎన్బీ హౌసింగ్- జీపీటీ ఇన్ఫ్రా.. జూమ్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 258 పాయింట్లు జంప్‌చేసి 38,309కు చేరగా.. నిఫ్టీ 86 పాయింట్లు ఎగసి 11,333 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ వార్తలతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క కోల్‌కతా మెట్రో ప్రాజెక్ట్ గెలుచుకున్నట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ సైతం జోరు చూపుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రిఫరెన్షియల్, రైట్స్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదించినట్లు ఇప్పటికే పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడించింది. ఈ ప్రతిపాదనపై బుధవారం(19న) సమావేశంకానున్న బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తాజాగా తెలియజేసింది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 12 శాతం వరకూ దూసుకెళ్లింది. రూ. 270ను అధిగమించింది. ప్రస్తుతం 10 శాతం లాభంతో రూ. 265 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 19 లక్షలకుపైగా షేర్లు చేతులు మారడం గమనార్హం! జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ పీఎస్‌యూ రైల్వే వికాస్ నిగమ్.. కోల్‌కతా నుంచి రూ. 196 కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టు లభించినట్లు జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ తాజాగా పేర్కొంది. కాంట్రాక్టులో భాగంగా మెట్రో రైల్వే వయాడక్ట్సహా.. రెండు రైల్వే స్టేషన్ల అభివృద్ధిని సైతం చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 12 శాతం వరకూ దూసుకెళ్లింది. రూ. 31ను అధిగమించింది. ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 30 వద్ద ట్రేడవుతోంది. -
పీఎన్బీ హౌసింగ్‌లో వాటా విక్రయించిన పీఎన్బీ
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ భ్యాంకు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాను విక్రయ నిర్ణయాన్ని పూర్తి చేయనుంది. జనరల్ అట్లాంటిక్, వర్డె పార్టనర్స్ సంస్థలకు రూ. 1851 కోట్లకు విక్రయించనున్నామని పీఎన్బీ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. అయితే హౌసింగ్ యూనిట్లో ప్రమోటర్ హోదా ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఇందులో భాగంగా ఇరు సంస్థలు 1.09 కోట్ల పీఎన్బీ హౌసింగ్ షేర్లను రూ. 850 చొప్పున కొనుగోలు చేస్తాయి. ఈ విలువ ప్రకారం పీఎన్బీ హౌసింగ్ మొత్తం విలువ రూ. 926 కోట్లకు చేరుతుంది. ఈ విక్రయం అనంతరం పీఎన్బీకి హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటా 32.79 శాతం నుంచి 19.78 శాతానికి దిగిరానుంది. హౌసింగ్ యూనిట్లో వాటాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని గత డిసెంబర్లో పీఎన్బీ నిర్ణయించింది. ఈ ప్రకటనతో శుక్రవారం మార్కెట్లో పీఎన్బీ హౌసింగ్ ఫిన్ షేర్ దాదాపు 4శాతం లాభపడింది. -
పీఎన్బీ హౌసింగ్‌పై... హెచ్డీఎఫ్సీ, కోటక్ కన్ను!
ముంబై: గృహ రుణాల సంస్థ.. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్(పీఎన్‌బీహెచ్‌ఎఫ్)లో మెజారిటీ వాటాలు దక్కించుకునేందుకు దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పీఎన్‌బీహెచ్‌ఎఫ్ యాజమాన్యంతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ప్రమోటర్లయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కార్లైల్లకు ఉన్న మొత్తం 66% వాటాల కొనుగోలుపై భేటీలో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, దీనిపై బీఎస్ఈ సోమవారం వివరణ కోరగా.. పీఎన్‌బీహెచ్‌ఎఫ్ యాజమాన్యంతో సమావేశం వార్తలను హెచ్డీఎఫ్సీ ఖండించింది. హెచ్డీఎఫ్సీ గతంలో కూడా కెన్‌ఫిన్ హోమ్స్‌లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపింది. కానీ కెన్ ఫిన్ హోమ్స్ ప్రమోటర్లు వాటాల విక్రయ యోచనను పక్కన పెట్టడంతో డీల్ కుదరలేదు. ఒకవేళ పీఎన్‌బీహెచ్‌ఎఫ్ డీల్ గానీ కుదిరితే టేకోవర్ నిబంధనల ప్రకారం మిగతా వాటాల కొనుగోలు కోసం హెచ్డీఎఫ్సీ ప్రత్యేకంగా ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. అఫోర్డబుల్ హౌసింగ్ విభాగంలో కార్యకలాపాలు విస్తరించేందుకు హెచ్డీఎఫ్సీ రూ. 13,000 కోట్లు సమీకరించింది. పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌లో పీఎన్బీ, కార్లైల్‌కి చెరి 33 శాతం వాటాలు ఉన్నాయి. వాటాల విక్రయ డీల్ విలువ సుమారు రూ. 12,000 కోట్ల మేర ఉండొచ్చని.. ఒప్పందం కుదిరిందంటే కార్లైల్‌కి, పీఎన్బీకి చెరి రూ. 6,000 కోట్లు రావొచ్చని అంచనా. దాదాపు రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం నేపథ్యంలో వివిధ సంస్థల్లో వాటాలను విక్రయించడంతో పాటు ఇతరత్రా వనరుల ద్వారా కూడా నిధులు సమీకరించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన సంస్కరణలను అమలు చేసే దిశగా పీఎన్‌బీహెచ్, ఇక్రా, క్రిసిల్, బీఎస్ఈ వంటి సంస్థల్లో తగు సమయంలో తమ వాటాలను విక్రయించనున్నట్లు పీఎన్బీ ఇటీవలే స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. అడ్వైజర్ల నియామకంలో ప్రమోటర్లు.. కార్లైల్ ఇప్పటికే వాటాల విక్రయ ప్రక్రియ కోసం అడ్వైజర్‌గా కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీని నియమించుకుంది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని నియమించుకునే ప్రక్రియ ప్రారంభించింది. 2017 నవంబర్‌లో పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌లో సుమారు 6 శాతం వాటాలను జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ తదితర ఇన్వెస్టర్లకు పీఎన్బీ విక్రయించింది. ఇతరత్రా ఇన్వెస్టర్లలో బిర్లా సన్‌లైఫ్ ఎంఎఫ్, మోతీలాల్ ఓస్వాల్ ఎంఎఫ్, వాసాచ్, టి రోవి ప్రైస్, సింగపూర్ ప్రభుత్వం, ఫిడిలిటీ, ఇన్వెస్కో, రిలయన్స్ ఎంఎఫ్, నొమురా అసెట్ మేనేజ్మెంట్ మొదలైన సంస్థలు ఉన్నాయి. 14 శాతం ఎగిసిన షేరు.. వాటాల విక్రయ వార్తలతో సోమవారం పీఎన్‌బీహెచ్‌ఎఫ్ షేర్లు 14% పైగా పెరిగాయి. బీఎస్ఈలో 14.19% పెరిగి రూ. 1,223.35 వద్ద, ఎన్ఎస్ఈలో 13.89% పెరిగి రూ. 1,221.55 వద్ద షేర్లు క్లోజయ్యాయి. ఒక దశలో బీఎస్ఈలో 15.73% ఎగసి రూ. 1,239.95 స్థాయిని కూడా తాకాయి. మొత్తం మీద కంపెనీ మార్కెట్ విలువ మరో రూ. 2,637 కోట్ల మేర పెరిగి రూ. 20,484 కోట్లకు చేరింది. పీఎన్‌బీహెచ్‌ఎఫ్ ఏయూఎం రూ.62వేల కోట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌కు పశ్చిమ, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో 84 శాఖలు ఉన్నాయి. వ్యాపారంలో తనఖా ఖాతాల వాటా 70% మేర ఉంటుంది. సంస్థ.. నికర నిరర్ధక ఆస్తుల పరిమాణం 0.25%గాను, నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రు. 62,252 కోట్లుగాను ఉంది. 2016లో దాదాపు రూ. 3,000 కోట్ల ఐపీవోకి వచ్చినప్పట్నంచి పీఎన్బీ హౌసింగ్ మార్కెట్ విలువ సుమారు రెట్టింపయ్యింది. 2015 ఫిబ్రవరిలో కార్లైల్ రూ.1,600 కోట్లతో 49% వాటా దక్కించుకుంది. ఇటీవలే 5% వాటా విక్రయంతో ప్రస్తుతం పీఎన్బీ హెచ్ ఎఫ్‌లో కార్లైల్ వాటా 33%కి పరిమితమైంది. -
పీఎన్బీ హౌసింగ్ ఫినాన్స్ ఐపీవోకు సెబీ ఓకే
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫినాన్స్ ఐపీవోకు మార్కెట్ రెగ్యులేటరీ సెబి నుం అనుమతి లభించింది. దీంతో రూ.2,500 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన పీఎన్బీ ఐపీవోకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రాస్పెక్టస్ ను జులైలో సెబీకి సమర్పించారు. అయితే పబ్లిక్ ఆఫర్ కు ముందు అవసరమైన డ్రాప్ట్ డాక్యుమెంట్ అనుమతిపై తుది పరిశీలన పూర్తి చేసిన సెబీ అక్టోబర్ 6న ఈమేరకు అనుమతిని మంజూరు చేసింది. మూలధన అవసరాల నిమిత్తం సుమారు 35-37 శాతం మూలధన వాటాతో ఈ ఐపీవోకు వస్తోంది. అలాగే కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మెర్రిల్ లించ్, జెఎం ఫైనాన్షియల్, జెపి మోర్గాన్ , మోర్గాన్ స్టాన్లీ గ్లోబల్ కోఆర్డినేటర్స్ గా ఉన్నాయి. లోన్ పోర్ట్ ఫోలియోలో వ్యాపార విస్తరణ, ఎఫర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ లో నిర్దిష్ట లక్ష్యంపై దృష్టిపెట్టింది. తమ ఈక్విటీ వాటాల లిస్టింగ్ సంస్థ దూరదృష్టిని, తమ బ్రాండ్ ఖ్యాతి మరింత మెరుగుపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. కాగా పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రమోట్ చేస్తోంది. 2016 మార్చితో నాటికి పీఎన్ బీ ఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ రూ 2,699.54 ఆదాయాన్ని, రూ 327.57 కోట్ల (పన్ను తర్వాత) లాభాన్ని నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కంపెనీలో 51 శాతం వాటా కలిగి ఉంది. ఉంది. అది జోడించారు. ఆపరేషన్ల నుండి ఆదాయం ఇదే కాలంలో రూ 2,699.54 కోట్లు నమోదైంది. -
భారీ విస్తరణ దిశగా పీఎన్ బీ హౌసింగ్
ఏడాదిలో మరో 21 కొత్త పట్టణాల్లోకి ప్రవేశం ♦ త్వరలో విజయవాడ, ♦ విశాఖపట్నంలలో ఆఫీసులు ♦ తెలుగు రాష్ట్రాల కోసం హైదరాబాద్‌లో ♦ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న వ్యాపార అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ప్రకటించింది. ఇంత కాలం ఉత్తర, పశ్చిమ భారతదేశానికి పరిమితమైన పీఎన్బీ హౌసింగ్ ఇక నుంచి దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల కోసం హైదరాబాద్ కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో పీఎన్బీ హౌసింగ్ బిజినెస్ హెడ్ షాజీ వర్గీస్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో విజయవాడ, విశాఖపట్నంలలో కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా దక్షిణాదిలో కొత్తగా 10 పట్టణాలకు, మిగిలిన ప్రాంతాల్లో 11 పట్టణాలకు మొత్తం 21 పట్టణాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పీఎన్బీ హౌసింగ్ దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో శాఖలను కలిగి ఉంది. ఈ నెలల్లో కంపెనీ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ రూ. 25,000 కోట్ల మార్కును చేరుకోనున్నట్లు తెలిపారు. ఇందులో 27% వ్యాపారం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తోంది. సెంటిమెంట్ మెరుగవుతుంది ప్రస్తుతం వడ్డీరేట్లు తక్కువ స్థాయిలో ఉన్నా మార్కెట్ సెంటిమెంట్ ఇంకా బలహీనంగానే ఉందని వర్గీస్ తెలిపారు. వచ్చే ఏడాది మధ్యస్థాయి హౌసింగ్ మార్కెట్ సెంటిమెంట్ మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, లగ్జరీ గృహ మార్కెట్ కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దేశీయ గృహ రుణ మార్కెట్ 18 శాతం వృద్ధిని కనపరుస్తుంటే పీఎన్బీ వృద్ధి 25 శాతం కంటే ఎక్కువగా ఉందన్నారు. వచ్చే మూడు నాలుగేళ్లు కూడా మార్కెట్ వృద్ధికంటే అధిక వృద్ధిరేటును నమోదు చేయగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
గతవారం బిజినెస్
క్యూ3లో చైనా వృద్ధి రేటు 6.9 శాతం చైనా ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో 6.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత చైనా వృద్ధి ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. దేశం నుంచి ఎగుమతులు పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశం 7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. త్వరలో పీఎన్బీ హౌసింగ్ ఐపీఓ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా... ఈ రెండు కంపెనీలు ఐపీఓకు రావాలని యోచిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఇతర వ్యాపార అవసరాల కోసం వినియోగించుకోవాలనేది ఈ కంపెనీల ఆలోచన. ఈ రెండు కంపెనీలు త్వరలో ఐపీఓ సంబంధిత పత్రాలను మా ర్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనున్నాయని సమాచారం. ఆన్లైన్ విభాగంలోకి ఎంఅండ్ఎం ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ‘స్మార్ట్‌షిఫ్ట్’ అనే ఇంట్రా సిటీ లాజిస్టిక్స్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఇది కార్గో యజమానులకు, ట్రాన్స్పోర్టర్స్కు ఒక వినిమయ వేదికగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ పోర్టల్ మహీంద్రా లాజిస్టిక్స్ విభాగం కింద కాకుండా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుందని పేర్కొంది. 2020 నాటికి హోండా సెల్ఫ్ డ్రైవ్ కార్లు వాహన తయారీ కంపెనీలు తనంతట తానుగా నడిచే కార్ల (సెల్ఫ్ డ్రై వింగ్ కార్లు) తయారీపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. నిస్సాన్, టయోటా కంపెనీలకు సవాలు విసురుతూ హోండా కంపెనీ కూడా సెల్ఫ్ డ్రైవ్ కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. సెల్ఫ్ డ్రై వింగ్ కార్లను 2020 నాటికి రోడ్లపైన పరిగెత్తిస్తామని హోండా కంపెనీ ప్రకటించింది. ఈ విధంగా హోండా కంపెనీ నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీతో తన ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని భావిస్తోంది. కాఫీ డే ఐపీఓ ఇష్యూ ధర రూ.328 కాఫీ డే ఎంటర్ప్రైజెస్ తన ఐపీఓ ఇష్యూ ధరను రూ.328గా నిర్ణయించింది. గత శుక్రవారం(అక్టోబర్ 16న) ముగిసిన ఈ ఐపీఓకు ప్రైస్‌బాండ్‌గా రూ.316-328ని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఐపీఓ ద్వారా 3.5 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేశామని, రూ. 328 ఇష్యూ ధరను పరిగణనలోకి తీసుకుంటే రూ.1,150 కోట్ల నిధులు వస్తాయని తెలిపింది. ఈ ఇష్యూ 1.8 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని, రూ.2,000 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయని పేర్కొంది. వడ్డీ రేట్లను తగ్గించిన చైనా బ్యాంక్ ఆర్థిక వ్యవస్థకు ఊపునివ్వడానికి చైనా కేంద్ర బ్యాంక్ బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను తగ్గించింది. రుణ, డిపాజిట్ వడ్డీరేట్లను చెరో పావు శాతం తగ్గిస్తున్నట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పేర్కొంది. బ్యాంకులు తమ వద్ద ఉంచుకునే నగదుకు సంబంధించి రిజర్వ్ రిక్వైర్మెంట్ రేషియో(ఆర్ఆర్ఆర్)ను అర శాతం తగ్గించింది. ఆర్ఆర్ఆర్ను అరశాతం తగ్గించడం వల్ల బ్యాంకులకు పుష్కలంగా నిధులు అందుబాటులోకి వస్తాయని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చైనా కేంద్ర బ్యాంక్ భావిస్తోంది. గోల్డ్ డిపాజిట్ల వడ్డీరేట్ల స్వేచ్ఛ బ్యాంకులకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(బంగారం డిపాజిట్ పథకం) మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) శుక్రవారం జారీ చేసింది. గోల్డ్ డిపాజిట్లకు వడ్డీరేట్లను నిర్ణయించే పూర్తి స్వేచ్ఛ బ్యాంకులకే ఇస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. వచ్చే నెల 5న అధికారికంగా ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్బీఐ నిబంధనల నోటిఫికేషన్ వెలువడింది. నవంబర్ 6న భారత్‌లోకి యాపిల్ వాచ్‌లు! ఇటీవలే కొత్త ఐఫోన్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్ అతి త్వరలోనే తన స్మార్ట్‌వాచ్‌లను భారతీయులకు అందుబాటులోకి తీసుకురానుంది. యాపిల్ వెబ్సైట్ ప్రకారం.. ‘యాపిల్ వాచ్’ నవంబర్ 6న భారత మార్కెట్లోకి రానుంది. ఈ వాచ్‌లు అమెరికా, జపాన్, ఫ్రాన్స్, యూకే దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. రియల్టీ జాప్యాలు ఏపీలో అధికం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణ జాప్యం ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఉంది. రియల్టీ ప్రాజెక్టుల పూర్తి దాదాపు 45 నెలలు ఆలస్యం అవుతోంది. ఇక దేశం మొత్తం మీద సగటున రియల్టీ ప్రాజెక్టుల నిర్మాణ జాప్యం 33 నెలలుగా ఉంది. ప్రాజెక్టుల జాప్యాల్లో ఏపీ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (41 నెలలు), తెలంగాణ (40 నెలలు), పంజాబ్ (38 నెలలు) ఉన్నాయి. కాగా దేశంలో 2014-15 నాటికి 3,540 ప్రతిపాదిత రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్‌లో 75 శాతం ఇంకా ప్రారంభం కాలేదు. డీల్స్ * సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికాకు చెందిన నోహ కన్సల్టింగ్ కంపెనీని రూ.454 కోట్లకు కొనుగోలు చేసింది. * స్వీడన్‌కు చెందిన వాణిజ్య వాహనాల దిగ్గజం వొల్వొ గ్రూప్‌కు చెందిన ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.895 కోట్లకు కొనుగోలు చేయనుంది. * భారత్‌లో టెలికాం టవర్లను నిర్వహిస్తున్న వయామ్ నెట్‌వర్క్స్‌లో 51 శాతం వాటాను అమెరికాకు చెందిన అమెరికన్ టవర్ కార్పొ(ఏటీసీ) రూ.7,600 కోట్లకు కొనుగోలు చేయనున్నది. * మెమరీ కార్డులు వంటి స్టోరేజ్ పరికరాలు తయారు చేసే శాన్డిస్క్ కంపెనీని హార్డ్-డిస్క్ డ్రైవ్‌లు తయారు చేసే వెస్టర్న్ డిజిటల్ కార్పొ 1,900 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనున్నది. * అంతర్జాతీయ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ భారత మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ రూ.243 కోట్లకు కొనుగోలు చేయనున్నది. * అమెరికా బిట్ కాయిన్ స్టార్టప్ ఆబ్రాలో టాటా సన్స్ చైర్మన్ ఎమిరటస్ రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు. ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశారో తెలియాల్సి ఉంది.