ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫినాన్స్ ఐపీవోకు మార్కెట్ రెగ్యులేటరీ సెబి నుం అనుమతి లభించింది. దీంతో రూ.2,500 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన పీఎన్బీ ఐపీవోకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రాస్పెక్టస్ ను జులైలో సెబీకి సమర్పించారు. అయితే పబ్లిక్ ఆఫర్ కు ముందు అవసరమైన డ్రాప్ట్ డాక్యుమెంట్ అనుమతిపై తుది పరిశీలన పూర్తి చేసిన సెబీ అక్టోబర్ 6న ఈమేరకు అనుమతిని మంజూరు చేసింది. మూలధన అవసరాల నిమిత్తం సుమారు 35-37 శాతం మూలధన వాటాతో ఈ ఐపీవోకు వస్తోంది. అలాగే కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మెర్రిల్ లించ్, జెఎం ఫైనాన్షియల్, జెపి మోర్గాన్ , మోర్గాన్ స్టాన్లీ గ్లోబల్ కోఆర్డినేటర్స్ గా ఉన్నాయి. లోన్ పోర్ట్ ఫోలియోలో వ్యాపార విస్తరణ, ఎఫర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ లో నిర్దిష్ట లక్ష్యంపై దృష్టిపెట్టింది.
తమ ఈక్విటీ వాటాల లిస్టింగ్ సంస్థ దూరదృష్టిని, తమ బ్రాండ్ ఖ్యాతి మరింత మెరుగుపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. కాగా పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రమోట్ చేస్తోంది. 2016 మార్చితో నాటికి పీఎన్ బీ ఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ రూ 2,699.54 ఆదాయాన్ని, రూ 327.57 కోట్ల (పన్ను తర్వాత) లాభాన్ని నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కంపెనీలో 51 శాతం వాటా కలిగి ఉంది. ఉంది. అది జోడించారు. ఆపరేషన్ల నుండి ఆదాయం ఇదే కాలంలో రూ 2,699.54 కోట్లు నమోదైంది.
పీఎన్బీ హౌసింగ్ ఫినాన్స్ ఐపీవోకు సెబీ ఓకే
Published Thu, Oct 13 2016 5:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement