సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) క్యూ2లో ఢమాల్ అంది. శుక్రవారం విడుదల చేసిన ఈ ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాల్లో నికర నష్టాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తోముగిసిన క్యూ2లో రూ. 4532 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత త్రైమాసికంలో రూ. 940 కోట్లతో పోలిస్తే తాజా క్వార్టర్‌లో భారీ నష్టాలను నమోదు చేసింది.
పీఎన్‌బీ నికర వడ్డీ ఆదాయం కూడా 1 శాతం తగ్గి రూ. 3974 కోట్లకు పరిమితమైంది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 18.26 శాతం నుంచి 17.16 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 10.58 శాతం నుంచి 8.9 శాతానికి నీరసించడం గమనార్హం. త్రైమాసిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 5758 కోట్ల నుంచి రూ. 9758 కోట్లకు ఎగశాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 5250 కోట్ల నుంచి రూ. 4476 కోట్లకు తగ్గాయి. రైటాఫ్స్ రూ. 2648 కోట్ల నుంచి రూ. 3543 కోట్లకు ఎగశాయి. ఈ ఫలితాల నేపథ్యంలో పీఎన్‌బీ కౌంటర్‌లో అమ్మకాలతో 4శాతానికి పైగా నష్టపోయింది.
అయితే ఇటీవల నీరవ్‌మోదీ స్కాంతో అభాసుపాలైన పీఎన్‌బీ ఎసెట్ క్వాలీటీ క్వార్టర్-ఆన్ క్వార్టర్ మెరుగుపడింది. సెప్టెంబర్ చివరినాటికి రుణాల మొత్తం 17.16 శాతంగా ఉంది. జూన్ చివరి నాటికి ఇది 18.26 శాతం, అంతకు ముందు ఏడాది 13.31 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment