
పీఎన్‌బీ ఫైల్ ఫోటో
సాక్షి, లక్నో:దేశవ్యాప్తంగా పీఎన్‌బీ మెగాస్కాం రేపిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే..ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. బ్యాంకు ఉద్యోగి ఒకరు అనుమానాస్పద రీతిలో గురువారం శవమై తేలారు. దీంతో బ్యాంకింగ్ వర్గాల్లో కలకలం రేగింది.
లక్నోకు చెందిన రోహిత్ శ్రీవాత్సవ (28) ఉత్తర ప్రదేశ్‌లో బలరాంపూర్ పీఎన్‌బీ బ్రాంచ్‌లో హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అయితే రోహిత్ మృతదేహాన్ని మంకాపూర్ రోడ్డులోని కల్వర్ట్‌లో గుర్తించామని పోలీసు అధికారులు వెల్లడించారు. బంధువులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.