
సాక్షి, లక్నో: పంజాబ్ నేషనల్ మహిళా బ్యాంకు ఉద్యోగిపై యాసిడ్ దాడి కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు పీఎన్‌బీ ఉద్యోగి(29)పై యాసిడ్ చల్లి పారిపోయారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు ఆమెకుసమీపంలో నిలుచ్చున్న మరో ఏడుగురు కూడా గాయాలపాటైనట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని పక్కనున్న వారు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.