పీఎన్‌బీ స్కాం: బ్యాంకు కీలక ప్రకటన | Customers money safe with us, says PNB | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కాం: బ్యాంకు కీలక ప్రకటన

Published Mon, Apr 2 2018 6:46 PM | Last Updated on Mon, Apr 2 2018 6:48 PM

Customers money safe with us, says PNB - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వేలకోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) సోమవారం కీలక ప్రకటన చేసింది.  దాదాపు రూ.13వేల కోట్ల  స్కాం  రేపిన ప్రకంపనల నేపథ్యంలో వినియోగదారులకు భరోసా ఇస్తూ  ప్రకటన జారీ చేసింది.  వినియోగదారుల సొమ్ము  పూర్తి భద్రంగా ఉందనీ, ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరింది.  కస‍్టమర్లు తమ సొమ్మును  ఎపుడైనా ఉపసంహరణ, లేదా డిపాజిట్‌  యథావిధిగా చేసుకోవచ్చని హామీ ఇచ్చింది.  అనైతిక ,అక్రమ పద్ధతులను తాము సహించబోమని స్పష్టం చేసింది.

 ఖాతాదారుల ఆందోళనలను పరిష్కరించాలని కోరుతూ తరచూ అడిగే ప్రశ్నలు(FAQs) పై  వివరణాత్మక  ప్రకటన ఇచ్చింది. అక్రమ పద్దతులను, మోసపూరిత లావాదేవీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని పేర్కొంది.  ఈ క్రమంలోనే  ఈ స్కాంకు  సంబంధించి నియంత్రణాధికారులు, చట్ట సంస్థలకు వెంటనే  ఫిర్యాదు చేశామని  వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement