
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) తన బీమా విభాగం పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకుంటోంది. తనకున్న 30 శాతం వాటాల నుంచి 4 శాతం వాటాల విక్రయంపై ప్రస్తుతం దృష్టి పెట్టింది. 2016 నుంచీ పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఐపీవోకు రావాలనుకుంటోంది. జాయింట్ వెంచర్ నుంచి అమెరికా కంపెనీ మెట్‌లైఫ్ పూర్తిగా బయటకు వెళ్లిపోవాలని భావిస్తుండడంతో ఐపీవో అనివార్యం కానుంది. 2001లో ముంబై కేంద్రంగా పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు కాగా, ఇందులో పీఎన్‌బీకి 30%, మెట్‌లైఫ్‌కు 26%, ఎల్‌ప్రోకు 21 శాతం, ఎం పల్లోంజి అండ్ కంపెనీకి 18%, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకుకు 5 శాతం చొప్పున వాటాలున్నాయి.
‘‘పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఐపీవోతో సరైన సమయంలో మార్కెట్లోకి వస్తాం. ప్రస్తుతం మార్కెట్ స్తబ్దుగా ఉంది. కనుక వచ్చే ఆర్థిక సంవత్సరంలో వస్తాం’’ అని పీఎన్‌బీ ఎండీ, సీఈవో సునీల్ మెహతా మీడియాకు తెలిపారు. ఐపీవో సైజుపై ఆయన వివరాలేవీ చెప్పలేదు. సరైన ధరను గుర్తించేందుకు పీఎన్‌బీ మెట్‌లైఫ్ తన వాటాల నుంచి 4 శాతాన్ని విక్రయించే ప్రయత్నాల్లో ప్రస్తుతం ఉంది. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో బ్యాంకుకున్న వాటాలను కొనుగోలు చేసేందుకు బిడ్లు వచ్చాయని, వీటిపై
Comments
Please login to add a commentAdd a comment