
ముంబై: వివిధ బ్యాంకుల్లో ఉండిపోయిన తమ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు/ఖాతాల వివరాలను కస్టమర్లు తెలుసుకునేందుకు ఉద్దేశించిన ఉద్గమ్ పోర్టల్‌లో 30 బ్యాంకులు భాగస్వాములైనట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మొత్తం అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లలో వీటి వాటా 90 శాతంగా ఉంటుందని (విలువపరంగా) పేర్కొంది. క్లెయిమ్ చేయని తమ డిపాజిట్లు/ఖాతాల వివరాలను తెలుసుకునేందుకు యూజరు ముందుగా తన పేరు, మొబైల్ నంబరుతో ఉద్గమ్ (యూడీజీఏఎం– అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్) పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
వివిధ బ్యాంకుల్లో తమ పేర్లతో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు, ఖాతాలను సెర్చ్ చేసుకునేందుకు, సెటిల్మెంట్ ప్రక్రియ వివరాలను తెలుసుకునేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. సెటిల్మెంట్ కోసం ఆయా బ్యాంకులను సందర్శించాల్సి ఉంటుంది. 2023 మార్చి ఆఖరు నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణం రూ. 42,270 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment