జ్యురిచ్: రష్యాతో యుద్ధంలో చితికిపోయిన ఉక్రెయిన్ దేశాన్ని పునర్నిర్మించేందుకు ఆ దేశ అధ్యకక్షుడు జెలెన్‌స్కీ నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ఆయన స్విట్జర్లాండ్ వెళ్లారు.
సదస్సులో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు, అగ్రశ్రేణి ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల యాజమాన్యాలను జెలెన్‌స్కీ కలుస్తున్నారు. తమ దేశాన్ని పునర్నిర్మించేందుకు అప్పులివ్వడంతో పాటు పెట్టుబడులు పెట్టాల్సిందిగా జెలెన్‌స్కీ వారిని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇందులో భాగంగా అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేస్ సీఈవో జేమీ డైమన్‌తో జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. డైమన్‌తోనే కాక ప్రముఖ పీఈ సంస్థలు బ్లాక్‌రాక్, బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్, కార్లైల్ గ్రూపు, బ్లాక్‌స్టోన్ సంస్థల యాజమాన్యాలతోనూ జెలెన్‌స్కీ చర్చలు జరుపుతున్నారు.
ఈ సందర్భంగా జెలెన్‌స్కీ మాట్లాడుతూ ‘2023లో ఉక్రెయిన్ ఎకానమీ 5 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది మరో 4.6 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ఈ సమయంలో మాకు ప్రభుత్వ పెట్టుబడితో పాటు ప్రైవేటు పెట్టుబడి కూడా ఎంతో ముఖ్యం’అని జెలెన్ స్కీ తెలిపారు. కాగా, తాజాగా ఐక్యరాజ్యసమితి ఉక్రెయిన్‌కు తక్షణమే 4.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కావాలని తన భాగస్వామ్య దేశాలను కోరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment