ఏడాది పెట్టుబడుల కోసం... | Duration Fund in SBI Magnum | Sakshi
Sakshi News home page

ఏడాది పెట్టుబడుల కోసం...

Published Mon, Apr 22 2019 8:49 AM | Last Updated on Mon, Apr 22 2019 8:50 AM

Duration Fund in SBI Magnum - Sakshi

అంచనాలకు అనుగుణంగా ఈ నెల ఆరంభంలో ఆర్‌బీఐ మరోసారి కీలక రేటును పావు శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు 6 శాతానికి దిగివచ్చింది. ఆర్‌బీఐ తన విధానాన్ని తటస్థం వద్దే కొనసాగించింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల పరంగా రిస్క్‌ తీసుకోలేని వారు, సంప్రదాయ ఇన్వెస్టర్లు కొద్ది కాలం కోసం ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఎస్‌బీఐ మ్యాగ్నం లో డ్యురేషన్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఎందుకంటే ఈ పథకం ఆరు నెలల నుంచి ఏడాది కాల వ్యవధితో కూడిన డెట్‌ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంది. దీంతో రేట్ల పరంగా రిస్క్, అస్థిరతల నుంచి రక్షణ ఉంటుంది. అయితే, ఈ తరహా పథకాలు అద్భుత రాబడులను ఇవ్వవు. అన్ని కాలాల్లోనూ స్థిరమైన రాబడులను ఆశించే వారికి ఇది ఎంపిక అవుతుంది. ఏడాది, ఆలోపు కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు దీన్ని పరిశీలించొచ్చు.

పనితీరు..: ఎస్‌బీఐ మ్యాగ్నం లో డ్యురేషన్‌ ఫండ్‌ అనే ఈ పథకం గతంలో ఎస్‌బీఐ అల్ట్రా షార్ట్‌టర్మ్‌ ఫండ్‌ పేరుతో కొనసాగింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 7.5 శాతం రాబడులను ఇచ్చింది. ఏడాది కాలంలో రాబడులు 7.9 శాతంగా ఉన్నాయి. ఇక మూడేళ్లలో వార్షికంగా ఇచ్చిన రాబడులు 8 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో లో డ్యురేషన్‌ ఫండ్స్‌ విభాగం సగటు రాబడులు ఏడాదిలో 7.5 శాతం, మూడేళ్లలో వార్షికంగా 7.5 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 7.8 శాతం చొప్పున ఉన్నాయి. ఇక ఈ పథకం  2007లో ఆరంభం కాగా, నాటి నుంచి చూస్తే ఏటా సగటున 7.85 శాతం రాబడులను ఇప్పటి వరకు అందించింది. 2015, 2017లో ఈ పథకం రాబడులను కచ్చితంగా పరిశీలించాల్సిందే. ఎందుకంటే ఆ సంవత్సరాల్లో లాంగ్‌ డ్యురేషన్‌ గిల్ట్‌ ఫండ్స్‌ 5 శాతం, 2 శాతం సగటు రాబడులు ఇవ్వగా, ఎస్‌బీఐ లో డ్యురేషన్‌ ఫండ్‌ మాత్రం 8.6 శాతం, 6.6 శాతం చొప్పున ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు అందించింది. లాంగ్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ వడ్డీ రేట్ల పరంగా సున్నితంగా ఉంటాయి. బాండ్ల ర్యాలీ కారణంగా లాంగ్‌ డ్యురేషన్‌ డెట్‌ ఫండ్స్‌ ఇటీవల మంచి పనితీరు చూపించాయి. అయితే, స్థిరమైన రాబడులు కోరుకునే వారికి లో డ్యురేషన్‌ బాండ్‌ ఫండ్స్‌ మరింత అనుకూలమని చెప్పొచ్చు.

పోర్ట్‌ఫోలియో..: ఎస్‌బీఐ లో డ్యురేషన్‌ పథకంలో క్రెడిట్‌ రిస్క్‌ తక్కువ. అధిక రేటింగ్‌ కలిగిన ఏఏఏ, ఏ1ప్లస్‌ డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఫిబ్రవరి నాటికి ఈ పథకం పెట్టుబడుల్లో 46 శాతం ఏఏఏ రేటెడ్‌ సాధనాల్లోనే ఉన్నాయి. ఏ1ప్లస్‌ డెట్‌ సాధనాల్లో 19.5 శాతం, ఏఏ ప్లస్‌ బాండ్స్‌లో 15 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలోని పెట్టుబడి సాధనాల సగటు మెచ్యూరిటీ ఐదు నెలలు.  

ఎఫ్‌డీతో పోలిస్తే...
స్వల్ప కాలం అంటే ఏడాది వరకు పెట్టుబడులకు ఈ పథకం అనువుగా ఉంటుంది. ఇదే కాలంలో బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.5–7 శాతం మధ్య ఆఫర్‌ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 7.5 శాతం వరకు వడ్డీ రేటును ఇస్తున్నాయి. మార్కెట్‌ రిస్క్‌ను భరించే వారు, లిక్విడిటీ ప్రధానంగా భావించే వారు లో డ్యురేషన్‌ ఫండ్‌ తరహా మ్యూచువల్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఎఫ్‌డీలను ముందుగా ఉపసంహరించుకుంటే వడ్డీ రేటు తక్కువే వస్తుందని గమనించాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఈ పరిస్థితి ఉండదు.

ఏ బ్యాంకులో ఎంత వడ్డీ?
రూ. కోటి వరకు డిపాజిట్లు,(ఏప్రిల్‌–2– 2019  అంకెలు శాతాల్లో)


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement