
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్) 20 బేసిస్ పాయింట్లు లేక 0.2 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో ఎస్‌బీఐసహా పలు బ్యాంకులు ఇప్పటికే తమ రుణ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే.
తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం బ్యాంక్ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్ 7.60 శాతం నుంచి 7.8 శాతానికి ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment