సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు ఇవే! | Sukanya Samriddhi Scheme: Check interest rate in 2021, Income Tax Benefits | Sakshi
Sakshi News home page

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు ఇవే!

Published Sun, Apr 25 2021 5:29 PM | Last Updated on Sun, Apr 25 2021 5:33 PM

Sukanya Samriddhi Scheme: Check interest rate in 2021, Income Tax Benefits - Sakshi

కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల భవిష్యత్ కోసం అందిస్తోన్న పథకమే సుకన్య సమృద్ది యోజన. ఇందులో కేవలం ఆడ పిల్లల పేరిట మాత్రమే డబ్బులు పొదుపు చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఇందులో చేరోచ్చు. ఈ పథకం వలన అమ్మాయిలకు ఆర్థిక భద్రత ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వలన మీ అమ్మాయి కలలను సాకారం చేయవచ్చు. ఇందులో పొదుపు చేసిన నగదుపై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో చేరాలని భావించే వారు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లితే సరిపోతుంది. సులభంగానే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. అయితే అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి.

సుకన్య సమృద్ధి యోజన అర్హతలు, ప్రయోజనాలు:

  • పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్లల పేరి మీద వారి సంరక్షకులు ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
  • పోస్టాఫీసులో లేదా బ్యాంకులలోనైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
  • ఒక కుటుంబంలోని ఇద్దరు బాలికలు ఉన్న కూడా  ఖాతా ఓపెన్ చేయవచ్చు. 
  • ఈ ఖాతాను ఓపెన్ చేయడానికి కనీసం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ఏడాదికి నగదు జమ చేయవచ్చు. 
  • ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అంటే స్కీమ్‌లో చేరి 21 ఏళ్ల తర్వాతనే డబ్బులు తీసుకోగలం.
  • అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాత కొంత నగదు తీసుకోవచ్చు. 
  • సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 21 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు జమ చేయాలి.
  • ప్రతి నెలకు రూ.3 వేలు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ కాలానికి రూ.15 లక్షలకు పైగా పొందవచ్చు. 
     

చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement