ఒకవేళ మీకు కనుక పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా ఉన్నట్లయితే శుభవార్త. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఖాతా విషయంలో ₹3,500 వరకు సంపాదించిన వడ్డీపై పన్ను మినహాయింపును కేంద్రం అందిస్తుంది. ఒకవేళ మీకు ఉమ్మడి ఖాతా ఉన్నట్లయితే పన్ను మినహాయింపు ₹7,000 వరకు ఉంటుంది. అలాగే, చాలా తక్కువ వడ్డీ రేటును అందిస్తున్న బ్యాంకు పొదుపు ఖాతా కంటే అధిక వడ్డీరేటుతో పాటు పన్ను మినహాయింపు ఇస్తూ పోస్టాఫీసు కొత్త ఖాతాదారులను ఆకట్టుకుంటుంది. పొదుపు ఖాతాలపై పోస్టాఫీసు అందిస్తున్న వడ్డీ రేట్లు చారిత్రాత్మకంగా తక్కువగా ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పొదుపు ఖాతాపై వడ్డీ రేటు 2.7 శాతం అందిస్తుంది. అదే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ పై 4 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. కనీసం ₹500 డిపాజిట్తో పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను తెరవవచ్చు. తపాలా కార్యాలయ పొదుపు ఖాతాపై వడ్డీ ప్రతి నెలా 10వ తేదీ లేదా నెలలో చివరి రోజు కనీస బ్యాలెన్స్ పై లెక్కిస్తారు. ఒకవేళ ఆర్థిక సంవత్సరం చివరల్లో అకౌంట్ బ్యాలెన్స్ రూ.500కు మించి డబ్బులు జమ చేయకపోతే అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజుగా రూ.100 కట్ చేస్తారు. పోస్టాఫీసు పొదుపు ఖాతాతో సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తారు. జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును యథాతదంగా ఉంచిది.
Comments
Please login to add a commentAdd a comment