
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బాకీ చెల్లించడంలేదని అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఇంటికి తాళం వేయించిన సంఘటన ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి..ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన ఒడ్డె శాంతవ్వ 15 నెలలక్రితం అదే గ్రామానికి చెందిన మహమ్మద్ ముస్తాఫాకు 2 శాతం వడ్డీపై రూ.2.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. అప్పు తీర్చడంలో ఆర్థిక ఇబ్బందులు ఉండడం మూలంగా వాయిదా ప్రకారం ముస్తాఫా శాంతవ్వకు డబ్బు ఇవ్వలేకపోయాడు.
కుటుంబసభ్యులను బయటకు పంపి ఇంటికి తాళం వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అరగంటలోపే తాళాన్ని తీయించి సమస్యపై సోమవారం మాట్లాడతామని ఇద్దరికీ హామీ ఇచ్చారు. ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌కు రావడంతో సముదాయించి వాయిదా పద్ధతిలో డబ్బు ఇవ్వడానికి ఒప్పందం కుదిర్చారు. సమస్యను ఇద్దరి సమ్మతితో ఎలాంటి కేసు లేకుండా పరిష్కారం చేసిన ఎస్సై ప్రవీణ్‌కుమార్ తీరును పలువురు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment