న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐ ‘ఆరోగ్యం హెల్త్‌కేర్ బిజినెస్ లోన్’ను ఆవిష్కరించింది. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఆరోగ్య సంరక్షణ రంగానికి మద్దతుగా రుణ పథకాన్ని తీసుకొచ్చింది. ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్‌లు, పాథాలజీ ల్యాబ్‌లు, తయారీ కంపెనీలు, సరఫరాదారులు, దిగుమతిదారులు, రవాణా సంస్థలు ఇలా ఆరోగ్యసంరక్షణ రంగంతో ముడిపడిన అన్ని రంగాల కంపెనీలకు ఈ పథకం కింద రుణాలను ఎస్‌బీఐ మంజూరు చేయనుంది. సామర్థ్య విస్తరణ లేదా ఆధునికీకరణ లేదా మూలధన అవసరాల కోసం టర్మ్‌లోన్‌ను తీసుకునేందుకు అర్హులని బ్యాంకు తెలిపింది.
గరిష్టంగా రూ. 100 కోట్లు
మెట్రో కేంద్రాల్లో అయితే ఒక్కో దరఖాస్తుదారు గరిష్టంగా రూ.100 కోట్లను తీసుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో రుణ గరిష్ట పరిమితి రూ.10–20 కోట్ల మధ్యనుంది. రూ.2 కోట్ల వరకు తీసుకునే రుణాలకు ఎటువంటి తనఖా / హామీనిగానీ సమర్పించాల్సిన అవసరం లేదు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత హెల్త్ కేర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా భారీ ఎత్తున రుణాలుఏ మంజూరు చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. దానికి తగ్గట్టుగా ఎస్‌బీఐ హెల్త్ కేర్ బిజినెస్ లోన్‌ను ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment