Micro Small and Medium Enterprises policy
-
వివాద్ సే విశ్వాస్ను ఆకర్షణీయంగా మార్చాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో భాగంగా ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్పులు చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ప్రభుత్వాన్ని కోరాయి. రీయింబర్స్మెంట్, వడ్డీ రేట్ల పరంగా ఆకర్షణీయంగా మార్చాలని ఎంఎస్ఎంఈలు కోరినట్టు ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అంతేకాదు, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఆన్లైన్లో ఉండాలని డిమాండ్ చేశాయి. బడ్జెట్ అనంతరం డీపీఐఐటీ ఏర్పాటు చేసిన వెబినార్‌లో భాగంగా ఈ అంశాలను ఎంఎస్ఎంఈలు లేవనెత్తాయి. టెక్నాలజీ వినియోగంతో వ్యాపార సులభతర నిర్వహణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. 2023–24 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈలకు వివాద్సే విశ్వాస్ పథకాన్ని ప్రకటించారు. -
Fact Check: ఏపీ బాగుపడటం ‘ఈనాడు’కు ఇష్టం లేదా?
ఏ రాష్ట్రంలోని లేని విధంగా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంటే, రాజకీయ ఉనికి కోల్పోతున్న చంద్రబాబుకు ఏదో రకంగా ఊతం ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ఈనాడు పత్రిక మరో అసత్య కథనాన్ని వార్చి వడ్డించే ప్రయత్నం చేసింది. గత టీడీపీ ప్రభుత్వం రూ.3409 కోట్ల ప్రోత్సాహక బకాయిలను పారిశ్రామిక యూనిట్లకు చెల్లించకుండా ఎగ్గగొట్టడం మాటను అప్పుడు, ఇప్పుడు పక్కన పెట్టి.. ప్రస్తుత వైఎస్ జగన్ సర్కారు పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం లేదనే తప్పుడు కథనాన్ని ప్రచురించింది ఈనాడు. ‘పారిశ్రామిక రాయితీల జాడేది?’ అంటూ కొత్త రాగం అందుకుంది. వాస్తవానికి ప్రతీ క్యాలెండర్ ఇయర్ ప్రకారం MSME లకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తూ వస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2019-20 క్యాలెండర్ ఇయర్‌కు రూ. 46 కోట్లను జగన్ సర్కార్ పారిశ్రామిక తోడ్పాడుకు నిధులు విడుదల చేయగా, 2020-21 క్యాలెండర్ ఇయర్లో రూ. 993.39 కోట్లను విడుదల చేసింది. సుమారు 8వేల MSMEలకు సహకారం అందించాలనే లక్ష్యంతో భారీ మొత్తంలో నిధులు విడుదల చేసింది. కోవిడ్ మహమ్మారితో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు చేయూత అందించే దిశగా అడుగులు వేసింది. ప్రతీ ఆగస్టు నెలలో MSMEలకు నిధులు విడుదల చేస్తోంది ఏపీ సర్కారు. ఏపీ సర్కారు అందించే ఈ తోడ్పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు నడుపుకునే వారికి ఎంతో లాభదాయకంగా మారింది. అయితే 2022-23 పారిశ్రామిక రాయితీలను ఆగస్టు నెలలో ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కానీ 2023లో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ ఉన్నందున సదరు ప్రోత్సాహకాలను 2023, ఫిబ్రవరి నెలలో విడుదల చేయడానికి ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈలోపు ఏపీలో ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో MSMEల నిధులు ఇవ్వడానికి అంతరాయం ఏర్పడింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ నిధులు విడుదల చేయడానికి సర్కారు సిద్ధంగా ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసి కూడా జగన్ సర్కారును అప్రతిష్టపాలు చేసి, చంద్రబాబును పైకి లేపాలనే తాపత్రాయంతో ఆర్టికల్‌ను ప్రచురించి మరీ రామోజీరావు తన భక్తిని చాటుకున్నాడు. ఎంతమాత్రం వాస్తవం లేని ఆ వార్తలోని అసలు వాస్తవాన్ని గ్రహించాలని ఏపీ పారిశ్రామిక శాఖ ఒక ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేసింది. MSMEలకు ఇతర సహకారం ఇలా.. 1. కరోనా సమయంలో సైతం పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలిచింది ఏపీ సర్కారు. 2014-15 క్యాలెండర్ ఇయర్ నుంచి మంజూరు చేయబడిన అన్ని ప్రోత్సహకాలను చెల్లించింది జగన్ సర్కారు. చంద్రబాబు చెల్లించకుండా వదిలేసిన ప్రోత్సహకాలను జగన్ సర్కార్ చెల్లించి MSMEలకు అండగా నిలిచింది. 2. మూడు నెలలపాటు విద్యుత్‌పై ఫిక్స్డ్ డిమాండ్ చార్జీలను రద్దు చేసింది 3. భారీ, మెగా పరిశ్రమలకు మూడు నెలల కాలానికి వడ్డీ కానీ జరిమానా వేయకుండా చర్యలు తీసుకుంది. 4. అదే సమయంలో అవసరమైన విద్యుత్‌ను పరిశ్రమలకు నిరంతరం అందించి వారికి వెన్నుదన్నుగా నిలిచింది. 5. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో భాగంగా సంస్కరణల అమలు విజయవంతంపై గతంలో ఏపీకి 10 శాతం మార్కులు మాత్రం పారిశ్రామిక వేత్తలు ఇస్తే, ప్రస్తుత ఏపీ పారిశ్రామిక అవగాహన సర్వేకు 100శాతం మార్కులు ఇవ్వబడ్డాయి. 6. కోవిడ్ కారణంగా 2020లో పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో పడిన సమయంలో ఏపీ 97. 89 శాతం మార్కులతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచి సత్తా చాటింది. MSMEల ప్రమోషన్ కోసం విధానాలు 2020-23 కాలానికి పారిశ్రామిక అభివృద్ధి విధానం కింద ఎస్సీ-ఎస్టీ పారిశ్రామిక వేత్తల అభ్యున్నతి కోసం ‘వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం’ సంక్షేమ పథకంతో పాటు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఏపీ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు 9,631 ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ. 661.58 కోట్లు మంజూరు చేసింది. వీరిలో 2207 మంది ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రూ. 111.08 కోట్లు, 424 మంది ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ. 24.31 కోట్లు జమ చేసింది ఏపీ సర్కారు. -
ఎంఎస్ఎంఈలకు రూ.6,062 కోట్లు
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ప్రపంచబ్యాంకు సహకారంతో కూడిన 6,062 కోట్ల పథకానికి (ర్యాంప్) ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా మార్కెట్ అనుసంధానత, రుణ సాయం మెరుగుపడనుంది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ర్యాంప్ అమల్లోకి వస్తుందని ప్రభు త్వం తెలిపింది. రూ.6,062 కోట్లలో రూ.3,750 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా అందించనుంది. మిగిలిన రూ.2,312 కోట్లను కేంద్రం సమ కూరుస్తుంది. కరోనా తర్వాత ఎంఎస్ఎంఈ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడం తెలిసిందే. -
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను సమీక్షిస్తున్నాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను(ఎఫ్‌టీఏ) సమీక్షిస్తున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా తెలిపారు. ఎఫ్‌టీఏల కారణంగా దేశీయ తయారీ రంగం కుదేలవుతోందంటూ కంపెనీలు ఆందోళన చెందుతున్న విషయం వాస్తవమేనని అన్నారు. ఇక్కడి కంపెనీలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. భారతీయ కంపెనీల ప్రయోజనాలను కాపాడతామని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తగు నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. హెచ్ఆర్ సేవల సంస్థ టీఎంఐ గ్రూప్ వాయిస్ ఆధారిత మొబైల్ సొల్యూషన్ ‘జాబ్స్‌డైలాగ్’ను మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ఒకే కార్మిక చట్టం..: ప్రస్తుతమున్న కార్మిక చట్టాల స్థానంలో ఎంఎస్ఎంఈ రంగం కోసం ఒకే చట్టాన్ని తీసుకొస్తున్నట్టు మిశ్రా తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిని ప్రవేశపెడతామని పేర్కొన్నారు. టెక్నికల్ స్కూల్స్ ఏర్పాటుకు శాంసంగ్ తరహాలో మరిన్ని కంపెనీలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మారుస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం కమిటీ ఏర్పాటైందని చెప్పారు. పెట్టుబడి, కార్మికుల సంఖ్యనుబట్టి సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ తరహా కంపెనీగా నిర్వచిస్తారు. 20 శాతం ఎంఎస్ఎంఈ నుంచే.. ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈల నుంచి 20 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయడం 2015 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగం కోసం కొత్త పాలసీ తీసుకొచ్చే పనిలో ఉన్నట్టు చెప్పారు. ముసాయిదా విధానం మూడు నాలుగు నెలల్లో ప్రకటి ంచే అవకాశం ఉందన్నారు. విదేశాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. పాలసీలో చేర్చే అంశాలపై చర్చించేందుకు ఆర్థిక శాఖ, ఎంఎస్ఎంఈ, ఆర్బీఐకి చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటైందన్నారు. ఎంఎస్ఎంఈ రంగ సమస్యలను పరిష్కరించే దిశగా బ్యాంకులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 33 లక్షల మందికి.. 2014-15లో 33 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా చేసుకున్నామని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవో దిలీప్ షెనాయ్ తెలిపారు. శిక్షణ తీసుకున్న వారిలో 63 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని, దీనిని 70 శాతానికి చేర్చాలన్నది తమ ధ్యేయమని చెప్పారు. తమ కార్యకలాపాలను అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్టు టీఎంఐ గ్రూప్ చైర్మన్ టి.మురళీధరన్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 13 లక్షల ఎంఎస్ఎంఈలు మూతపడిన ఫలితంగా 18 లక్షల మంది ఉపాధి కోల్పోయారని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు.