ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వానికి రూ.1,336 కోట్లు (JPY 23679 మిలియన్స్) లోన్ అందించేందుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA), ఈ రోజు లోన్ అగ్రిమెంట్ మీద సంతకం సంతకం చేసింది.
ఈ కార్యక్రమం కేవలం పట్టణ పారిశ్రామికవేత్తలకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, ఔత్సాహిక వ్యాపార నాయకులకు కూడా మద్దతునిచ్చేలా వ్యూహాత్మకంగా రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ కోసం లోన్ అగ్రిమెంట్ మీద ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ & జైకా ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సునోరి సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా జైకా ఇండియా ఆఫీస్ చీఫ్ రిప్రజెంటేటివ్ 'సైటో మిత్సునోరి' మాట్లాడుతూ.. తెలంగాణలో స్టార్టప్‌లు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడం మా లక్ష్యం అంటూ.. ప్రపంచంలోనే ఓడీఏ లోన్ ద్వారా స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్ అండ్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడానికి JICA మద్దతిచ్చే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదే అని ప్రకటించడానికి నేను చాలా సంతోషిస్తున్నానన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ నేతృత్వంలోని ప్రాజెక్ట్ దేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంలో జపాన్ & భారతదేశం మధ్య బలమైన భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతుందని ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment