
ముంబై: రుణాల పరంగా ఉన్న పరిమితులతో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా వ్యాపారాలు (ఎంఎస్‌ఎంఈ) ప్రభావితమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులపై జీ20 వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా సహాయ మంత్రి మాట్లాడారు.
(ఇదీ చదవండి: మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్)
ఈ అసమాన భారాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ వాణిజ్య కమ్యూనిటీ ఉమ్మడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య అంతరం పెరిగిపోతుండడం పట్ల కరాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా బలమైన, సమర్థవంతమైన సరఫరా వ్యవస్థల అవసరం ఉన్నట్టు చెప్పారు. ఆహారం, ఎరువులు, ఇంధనం, ఫార్మా వంటి ముఖ్యమైన రంగాల్లో జీ20 దేశాల మధ్య సహకారానికి పిలుపునిచ్చారు.
(రెడ్‌మి 12సీ, రెడ్‌మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే)