సాక్షి, హైదరాబాద్: పీవీ నర్సింహరావు ప్రధానమంత్రి అయ్యాక పారిశ్రామిక విధానంలో అనేక మార్పులు తెచ్చారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచంతో మనం పోటీ పడేలా విధివిధానాలు మార్చారని తెలిపారు. నేడు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే పీవీ, మన్మోహన్‌సింగ్‌యే కారణమని అతన్నారు.
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పాలసీ-2024ను సీఎం రేవత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మత్రులు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సృష్టించేందుకే ఈ కార్యక్రమమని తెలిపారు. పాలసీ లేకుంటే ఏ ప్రభుత్వం నడవదని.. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పాలసీ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. వ్యాపార విస్తరణను మరింత సరళీ కృతం చేసేందుకు ఈ కొత్త పాలసీ ఉపయోగపడుతుందన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటీవల్ హామీలను మేము నెరవేరుస్తామని సీఎం వెల్లడించారు. చిన్న గ్రామాలుగ ఉన్న మాదాపూర్, కొండాపూర్ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందాయని.. ఐటీ, ఫార్మీ రంగాల్లో మనం దూసుకుపోతున్నామన్నారు. మంచి పనులు ఎవరూ చేసినా కొనసాగిస్తాం. అందులో సందేహం లేదని తెలిపారు.
పట్టాలు పొందిన విద్యార్ధులకు ఉద్యోగాలు రావడం లేదు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు.. నైపుణ్యాలు ఉండటం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. టాటా ఇండస్ట్రీస్‌తో మాట్లాడి రూ, 2400 కోట్లు ఐటీఐలను అభివృద్ధి చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రాను వీసీగా నియమించాం. సాంకేతిక నైపుణ్యం లోపించిన వారికి ఉద్యోగాలు రావడం లేదు. యువతలో సాంకేతిక నైపుణ్యం పెంచితే ఉద్యోగాలు వస్తాయి.
వ్యవసాయం సంక్షోభంలో ఉంది. వ్యవసాయాన్ని ఎవరూ వదలద్దు. వ్యవసాయం మన సంస్కృతి. రైతులను రుణాల నుంచి విముక్తి కల్పించాం. గతంలో కృష్ణా గుంటూరులో ఒక ఎకరం అమ్మితే హైదరాబాద్‌లో 10 ఎకరాలు వచ్చేవి. ఇప్పుడు హైదరాబాద్‌లో 1 ఎకరం అమ్మితే గుంటూరులో 100 ఎకరాలు కొనొచ్చు. మూసీ అంటే మురికి కూపం కాదు అని నిరూపిస్తాం. మూసీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. విద్యార్ధులకు బట్టలు కూటే బాధ్యత కూడా మహిళలకే ఇచ్చాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment