
సాక్షి,కరీంనగర్: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నంప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆదివారం(సెప్టెంబర్15) కరీంనగర్‌లోని మానకొండూరు చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పొన్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ఉండొద్దని కోరుకుంటున్నారా? గత పదేళ్లలో ఏం జరిగిందో మాకు తెలియదా?
పరిపాలించే సత్తా మీకు మాత్రమే ఉందని అనుకోవద్దు. మీకంటే పాలన మాకే బాగా తెలుసు. హైదరాబాద్ లో నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వేచ్ఛ గా నిమజ్జనం చేసేలా కార్యాచరణ రూపొందించాం. సచివాలయం కూడా నిమజ్జనం రోజు పూర్తి స్థాయిలో పని చేస్తుంది. గతంలో సచివాలయంలో పని జరగకపోయేది. గణేష్ నిమజ్జనం వేళ బీఆర్‌ఎస్ వాళ్లు గురించి మాట్లాడటం కూడా వృధా’అని పొన్నం అన్నారు.
ఇదీ చదవండి.. గత ప్రభుత్వంలో అన్నీ స్కాములే
Comments
Please login to add a commentAdd a comment