సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును రక్షించడానికే మీరెప్పుడూ సీబీఐ విచారణ కోరుతుంటారని, సీబీఐ మీ పెంపుడు సంస్థ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డినుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై జ్యుడీషియల్ విచా రణ చేయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ఇందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించాలని వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్‌ను రక్షించడానికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చిలుక పలుకులు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉన్నా ఇప్పటివరకు కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదని, అప్పుడే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు.
బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని, గోషామహ ల్‌లో బీఆర్‌ఎస్ పోటీ చేయలేదని, జూబ్లీహిల్స్‌లో మాత్రం బీఆర్‌ఎస్ పోటీ చేసిన తీరు తీస్తుంటే వీళ్ల స్నేహం అర్థం అవుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్‌ఎస్ నేతలు లేనిపోని అపోహలు స్పష్టిస్తున్నారని, ఆటో డ్రైవర్లతో ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై మాట్లాడేందుకు ఎవరు వచ్చినా తాను రెడీగా ఉంటానని, సచివాలయంలోనైనా మాట్లాడేందుకు సిద్ధమన్నారు. ప్రజాపాలన దరఖాస్తులకు ఈనెల 6 వరకే గడువు అని, పొడిగింపు ఉండదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
కేంద్రం స్పందించాలి
లారీ డ్రైవర్ల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. లేకపోతే నిత్యవసరాల ధరలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను పిలిచి తెలంగాణ భవన్‌లో కేటీఆర్ భోజనాలు పెట్టడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఇంకా మంత్రి అనుకుంటున్నారే మోనని ఎద్దేవా చేశారు. కార్మికులకు భోజనాలు కాదు... వాళ్లకు బట్టలు కుట్టించాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment