ఈసారి మహిళా సంఘాల సభ్యులకే బతుకమ్మ చీరలు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ తాను అన్న మాటలను ఉపసంహరించుకున్న తరువాత కూడా చర్చ కొనసాగించడం అనవసరమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడి యాతో చిట్‌చాట్ చేస్తూ పలు అంశాలపై స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని నాగార్జున ఫ్యామిలీ కోరిన మేర కు మంత్రి వెంటనే స్పందించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్ర కటించారని గుర్తు చేశారు. ఆ అంశం అంతటి తో ముగిసిపోయిందని, పీసీసీ అధ్యక్షుడు కూ డా సమస్య సద్దుమణిగిందని చెప్పిన తరు వాత కూడా మాట్లాడటం శోచనీయమని అ న్నారు. కొండా సురేఖ ఇబ్బంది పడ్డప్పుడు మాట్లాడనోళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
సురేఖ ఒంటరి కాదని, బలహీ న వర్గాల మంత్రికి తామంతా అండగా ఉన్నా మని అన్నారు. కేంద్రం నుంచి పైసా తేలేని వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలన్నారు. ఈ సంవత్స రం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే బ తుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే బతుకమ్మ చీరలకు రూ. 150 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థి సంఘం నాయకుడిగా రెసిడెన్షియల్ విద్యాసంస్థల సమస్యలపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించానని, వారు సానుకూలంగా స్పందించారని పొన్నం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment