సాక్షి, హైదరాబాద్: దమ్ముంటే స్వేద పత్రంపై చర్చకు రావాలంటూ కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. పదేళ్లలో ఎవరి ఆస్తులు ఎంత పెరిగాయో చర్చకు సిద్ధమా?. భవనాలు, భూములు ఎవరికెన్ని ఉన్నాయో లెక్కలు తేలుద్దామా.. మీ లెక్కలు చెప్పేందుకు మేము సిద్దం.. మీరు సిద్దమా? అంటూ ప్రశ్నించారు.
చెమటలు చిందించి తెలంగాణను అప్పులపాలు చేశారు: కూనంనేని
బీఆర్‌ఎస్ నేతలు చెమటలు చిందించి తెలంగాణను అప్పులపాలు చేశారని, కేటీఆర్ స్వేదపత్రం పేరుతో ఎందుకు వివరించారో మాకైతే అర్థం కాలేదని సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు
‘‘మానవ తప్పిదాల వల్ల సింగరేణి నష్టాల్లో కూరుకుపోయింది. మరో 20 ఏళ్లలో సింగరేణి కాలం చెల్లనుందని 20 ఏళ్ల తర్వాత కొత్త మైన్స్ రాకపోతే సింగరేణి ఓ చరిత్రగా ఉండిపోనుంది. తెలంగాణలో పెద్ద సంస్థలన్నీ అప్పుల్లోనే ఉన్నాయి. సింగరేణి ఎన్నికలు జరగకుండా గత ప్రభుత్వం అనుకూల సంఘం ప్రయత్నం చేసింది. టీబీజీకే, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి’’ అని కూనంనేని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment