ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎంపీ అనిల్‌కుమార్
భారీ ఏర్పాట్లు చేసిన వివిధ ప్రభుత్వ శాఖలు
అబిడ్స్ / గన్‌పౌండ్రీ/ సిరికొండ: ఉబ్బసం రోగుల కోసం చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నగరంలో ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శనివారం ఉదయం ప్రారంభమైంది. రెండురోజుల పాటు బత్తిని కుటుంబం ఆ ధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని శాసనసభ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్షి్మ, మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మా ట్లాడుతూ, 150 సంవత్సరాలుగా మృగశిరకార్తెను పురస్కరించుకుని బత్తిన కుటుంబీకులు ఉచితంగా, సేవాభావంతో లక్షలాది మందికి చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారన్నారు. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది అస్తమా రోగుల సౌకర్యార్థం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.
32 కౌంటర్ల ద్వారా చేపప్రసాదం...
జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, వాటర్ బోర్డు, విద్యుత్, రెవెన్యూ, మత్స్యశాఖ, పోలీస్‌శాఖ, ట్రాఫిక్ శాఖ లతో పాటు పలు శాఖల అధికారులు చేపప్రసాద పంపిణీకోసం భారీ ఏర్పాట్లు చేశారని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లన్ని శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, 32 కౌంటర్ల ద్వారా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా చేయగా, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు రోగులకు అల్పాహారం అందించాయి.
వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో దాదాపు 6 లక్షల మంచినీటి ప్యాకెట్లు ఉచితంగా అందించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్స్ యాదవ్ ఆధ్వర్యంలో అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, బేగంబజార్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్‌లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో దాదాపు 60వేల చేపపిల్లలను శనివారం రాత్రి వరకు విక్రయించినట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం వరకు చేపప్రసాదం పంపిణీ జరుగనుందని వెల్లడించారు.
క్యూలైన్‌లో సొమ్మసిల్లి మృతి..
చేపమందు కోసం హైదరాబాద్ వచ్చిన నిజా మాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్లరామడుగు గ్రామానికి చెందిన మామిడి గొల్ల రాజన్న (65) తొక్కిస లాటలో మృతి చెందాడు. శనివారం ఉదయం క్యూలైన్‌లో వేచి ఉన్నప్పుడు, ఒకేసారి జనాన్ని పంపించడంతో తోపులాట జరిగి రాజన్న కిందపడిపోయాడు. అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment