asthma patients
-
ఉబ్బసం రోగులకోసం చేప ప్రసాదం
అబిడ్స్ / గన్‌పౌండ్రీ/ సిరికొండ: ఉబ్బసం రోగుల కోసం చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నగరంలో ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శనివారం ఉదయం ప్రారంభమైంది. రెండురోజుల పాటు బత్తిని కుటుంబం ఆ ధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని శాసనసభ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్షి్మ, మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మా ట్లాడుతూ, 150 సంవత్సరాలుగా మృగశిరకార్తెను పురస్కరించుకుని బత్తిన కుటుంబీకులు ఉచితంగా, సేవాభావంతో లక్షలాది మందికి చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారన్నారు. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది అస్తమా రోగుల సౌకర్యార్థం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. 32 కౌంటర్ల ద్వారా చేపప్రసాదం... జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, వాటర్ బోర్డు, విద్యుత్, రెవెన్యూ, మత్స్యశాఖ, పోలీస్‌శాఖ, ట్రాఫిక్ శాఖ లతో పాటు పలు శాఖల అధికారులు చేపప్రసాద పంపిణీకోసం భారీ ఏర్పాట్లు చేశారని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లన్ని శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, 32 కౌంటర్ల ద్వారా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా చేయగా, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు రోగులకు అల్పాహారం అందించాయి.వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో దాదాపు 6 లక్షల మంచినీటి ప్యాకెట్లు ఉచితంగా అందించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్స్ యాదవ్ ఆధ్వర్యంలో అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, బేగంబజార్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్‌లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో దాదాపు 60వేల చేపపిల్లలను శనివారం రాత్రి వరకు విక్రయించినట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం వరకు చేపప్రసాదం పంపిణీ జరుగనుందని వెల్లడించారు.క్యూలైన్లో సొమ్మసిల్లి మృతి.. చేపమందు కోసం హైదరాబాద్ వచ్చిన నిజా మాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్లరామడుగు గ్రామానికి చెందిన మామిడి గొల్ల రాజన్న (65) తొక్కిస లాటలో మృతి చెందాడు. శనివారం ఉదయం క్యూలైన్లో వేచి ఉన్నప్పుడు, ఒకేసారి జనాన్ని పంపించడంతో తోపులాట జరిగి రాజన్న కిందపడిపోయాడు. అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. -
కొత్త ప్రక్రియలతో ఆస్తమాను ఇలా అధిగమించవచ్చు..!
ఆస్తమా అదుపు చేయడానికి మందులు, స్టెరాయిడ్స్, ఇన్హేలర్స్ వంటి సంప్రదాయ మందులు వాడటం మామూలే. ఇప్పటికీ ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే మరికొన్ని కొత్త కొత్త ప్రక్రియల ద్వారా ఆస్తమాను అదుపు చేయడం ఇప్పుడు మరింత తేలికగా మారింది. ఈ కొత్త ప్రక్రియలను తెలుసుకుందాం. తీవ్రమైన ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఇప్పుడు బ్రాంకియల్ థర్మోప్లాస్టీ, బయలాజిక్ మెడిసిన్ అనే రెండు ఆధునిక చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో ఆస్తమా కాస్తంత తీవ్రమైన సమస్యగా ఉన్నవారు కూడా సాధారణ జీవితం గడపడం సాధ్యమవుతుంది. బ్రాంకియల్ థర్మోప్లాస్టీ ప్రక్రియలో ఒక ప్రత్యేకమైన పరికరం సహాయంతో శ్వాసనాళపు గోడల్ని వేడి చేస్తారు. ప్రోబ్ అనే పరికరాన్ని బ్రాంకోస్కోప్ సహాయంతో లోపలికి పంపుతారు. అది అక్కడ వేడిమిని వెలువరిస్తుంది. ఆ వేడిమి తో శ్వాసమార్గంలో చేరిన అదనపు మ్యూకస్‌ను తొలగిస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకునే నాళం విశాలంగా తెరుచుకుంటుంది. దాంతో హాయిగా శ్వాస పీల్చుకోవడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియను మూడు వారాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మూడు దఫాల చికిత్స పూర్తయ్యేసరికి తీవ్రమైన ఆస్తమా వ్యాధి లక్షణాలు బాగా తగ్గిపోతాయి. మంచి ఉపశమనం దొరుకుతుంది. జీవననాణ్యత గణనీయంగా పెరగడంతో పాటు, ఆస్తమా అటాక్స్ తగ్గుతాయి. దాంతో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాలూ తగ్గుతాయి. ఈ చికిత్స ఫలితాలు చాలా కాలం... అంటే దాదాపుగా ఎనిమిదేళ్లు ఉంటాయి. ఇన్హేలర్స్ వాడినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించని, పద్ధెమినిమిదేళ్లు పైబడిన యుక్తవయస్కులైన బాధితులకు ఎవరికైనా ఈ చికిత్స అందించవచ్చు. అలాగే ఇప్పుడు బయోలాజిక్ మెడిసిన్స్ అనే కొత్తరకం మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో శ్వాసనాళాల వాపు కారణంగా ఆ నాళాలు సన్నబడతాయి. ఆ వాపును ఈ మందులు తగ్గించడం ద్వారా ఆస్తమాను అదుపు చేస్తాయి. -
ఆస్తమా పేషెంట్లు భయపడొద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి సోకే అవకాశాలున్న పది ప్రధానమైన రోగలక్షణాలు, కారణాల్లో ఆస్తమా వ్యాధి లేదని పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ నిపుణులు డా.విశ్వనాథ్ గెల్లా స్పష్టం చేశారు. ఆస్తమా కారణంగా ఈ వ్యాధి తమకు త్వరగా సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఆస్తమా పేషెంట్లు కూడా సాధారణ రోగుల మాదిరిగా ఈ వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాజాగా అమెరికా, చైనా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు. ఇప్పటివరకు చైనా, అమెరికా, తదితర దేశాల్లో కరోనా కారణంగా సంభవించిన మరణాల్లోనూ ఆస్తమా ఉన్న వారు దాదాపుగా లేనట్టేనని తేలిందన్నారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్, 2018 అధ్యయనం ప్రకారం భారత్‌లో దాదాపు 4కోట్ల మంది ఆస్తమా రోగులున్నారని, వారిలో 5 శాతం మందిలో ఇది తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. ఇలాంటి పేషెంట్లు మాత్రం కరోనాకు గురయ్యే అవకాశాలున్నాయన్నారు. హ్యాండ్ హైజీన్‌ను పాటించే విషయంలో సరైన పద్ధతుల్లో వ్యవహరించాలని, ఎంత సమయంపాటు చేతులు కడుక్కోవాలి, దానికోసం అనుసరించాల్సిన విధానాలు తెలుసుకోవాలన్నారు. మంగళవారం (మే 5) ‘వరల్డ్ ఆస్తమా డే’, ‘వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే’ల సందర్భంగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వూ్యలో పల్మనాలజిస్ట్ డా. విశ్వనాథ్ గెల్లా వివిధ అంశాలపై ఏం చెప్పారంటే... ఆస్తమా ఆ జాబితాలో లేదు: కరోనా ప్రధానంగా డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, శ్వాసకోశ సంబంధి త, సీవోపీడీ వంటి పది రకాల లక్షణాలు, ఇప్పటికే వివిధ రకాల ఆరోగ్య సమస్యలున్న వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్టు వెల్లడైంది. ఆ జాబితాలో ఆస్తమా లేదు. ఇన్హేలర్స్ మానొద్దు... ఆస్తమా చికిత్సలో భాగంగా వాడుతున్న ఇన్హేలర్ల వినియోగాన్ని రోగులు ఆపొద్దు. వీటిని ఆపేసి ఆందోళనలతో ఆసుపత్రులకు వెళ్లి స్టెరాయిడ్స్ డోస్ పెంచడం వల్ల సమస్యలు ఎదురుకావొచ్చు. జపాన్ పరిశోధనల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తమా ఉన్నవారు ఇన్హేలర్స్ను మానాల్సిన అవసరం లేదు. టెలి మెడిసిన్‌కు ప్రాధాన్యతనివ్వాలి... ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో, టెలి మెడిసిన్ కన్సల్టేషన్ ద్వారా మందులు తీసుకోవడం మంచిది. ఆసుపత్రులకు వెళ్లడం వల్ల ఇతర సమస్యలు తలెత్తే అవకాశముంది. ఏదైనా సమస్య ఎదురైతే మాత్రం సంబంధిత డాక్టర్ని నేరుగా కలవాలి. తమకు తాము ఇన్హేలర్ డోస్ తగ్గించుకోవడం సరికాదు. ఆస్తమా రోగులు అక్యూట్ అటాక్ రాకుండా జాగ్రత్త పడాలి. అలర్జీలతో జాగ్రత్త పడాలి... ప్రస్తుత సమయంలో ఆస్తమా రోగులు అలర్జీల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. కార్పెట్‌తో వచ్చే అలర్జీలు, దుమ్ము, కొన్నిరకాల ఫాబ్రిక్స్, వాసనలు, వృత్తిరీత్యా వచ్చేసమస్యలతో అలర్జీలు వస్తాయి. అలర్జెక్ రునటిక్స్ ఉంటే తుమ్ములు, జలుబు వంటివి వస్తాయి. ప్రాణాయామం చేయగలిగితే మంచి ఫలితాలుంటాయి. చేతులు శుభ్రపరుచుకునేందుకు... చేతులను శుభ్రం చేసుకునే విషయంలో కూడా పది స్టెప్స్‌ను పాటించాలి. రోజువారీ జీవనంలో శుభ్రతా చర్యలకు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. బయట తిరిగొచ్చిన చెప్పులతో ఇంట్లో తిరగడం సరైంది కాదు. -
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఏటా మృగశిర కార్తె సందర్భంగా అందజేసే చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని నాంపలి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం 6 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించనుంది. ఇందుకోసం 1.65 లక్షల కొర్రమీను చేప పిల్లలను మత్స్యశాఖ అందుబాటులో ఉంచింది. ఆదివారం సాయంత్రం వరకు బత్తిని సోదరులు, వారి కుటుంబ సభ్యులు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆ తరువాత 10, 11 తేదీల్లో వారి ఇళ్ల వద్ద చేప ప్రసాదంపంపిణీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి భారీగా ఆస్తమా బాధితులు తరలి రానున్నారు. గతేడాది సుమారు 70 వేల మందికి పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య లక్ష వరకు చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా 40 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సుమారు 1,500 మందితో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా, నిరంతర విద్యుత్, తాగునీరు సదుపాయం కల్పించనుంది. చేప ప్రసాదం కోసం టోకెన్లు పంపిణీ చేయనున్నారు. జీహెచ్ంసీ ఆధ్వర్యంలో 100 మొబైల్ టాయిలెట్లను, 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని, 6 వైద్య బృందాలు, 3 మొబైల్ వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. బత్తిని కుటుంబం ప్రత్యేక పూజలు... మృగశిర కార్తె ప్రవేశం రోజున వంశపారంపర్యంగా తమ కుటుంబ సభ్యులు ఆస్తమా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదం కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బత్తిని హరినాథ్‌గౌడ్, బత్తిని శంకర్‌గౌడ్‌లు తెలిపారు. హైదరాబాద్ దూద్‌బౌలిలోని బత్తిని నివాసంలో శుక్రవారం ఉదయం సత్యనారాయణస్వామి పూజ నిర్వహించి చేప మందు పంపిణీకి ఏర్పాట్లను చేపట్టారు. చేప మందు పంపిణీ కార్యక్రమంలో బత్తిని హరినాథ్ గౌడ్‌తోపాటు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. 171 ఏళ్లుగా బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన మూడో తరం పంపిణీ చేస్తోంది. ఇతర వివరాల కోసం 9391040946, 8341824211, 9989989954 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఉబ్బసానికి చేప విరుగుడు!
ఏడాదికి ఒకసారి ఉబ్బసం రోగులకు హైదరాబాద్‌లో ఇచ్చే చేపమందుపై ఎన్నో వివాదాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. వీటి మాటెలా ఉన్నా ఉబ్బసంతో బాధపడుతున్న వారు మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు చేపలు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు లా ట్రోబ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ అధ్యయనంలో భాగంగా కొవ్వులు ఎక్కువగా ఉన్న చేప రకాలను ఆహారంగా తీసుకున్న ఉబ్బసం రోగుల ఊపిరితిత్తుల పనితీరు ఆరునెలల్లో మెరుగైనట్లు గుర్తించారు. చిన్నతనంలో వచ్చే ఉబ్బసానికి చేపలతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం మెరుగైన చికిత్స అనేందుకు ఇదో తార్కాణమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మారియా పాపామైకేల్ అంటున్నారు. ఉప్పు, చక్కెర, సాధారణ కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారంతో ఉబ్బసం లక్షణాలు తీవ్రమవుతాయని ఇప్పటికే గుర్తించగా చేపల్లో ఉండే ఒమేగా –2 ఫ్యాటీ యాసిడ్లు దీనికి మినహాయింపు అని తమ అధ్యయనం చెబుతోందని అన్నారు వారానికి కేవలం రెండు సార్లు మాత్రమే చేపలు ఆహారంగా తీసుకున్నా ఊపిరితిత్తుల్లోని మంట/వాపు తగ్గే అవకాశముందని చెప్పారు. గ్రీస్, ఆస్ట్రేలియాల్లోని 5 – 12 మధ్య వయసు పిల్లలపై తాము ఈ అధ్యయనం చేసినట్లు చెప్పారు. కొంతమందికి సాధారణ ఆహారం, ఇంకొంతమందికి దాదాపు 150 గ్రాముల కొవ్వులున్న చేపలు ఆహారంగా ఇచ్చామని, ఆరు నెలల తరువాత పరిశీలించగా ఊపిరితిత్తుల మంట/వాపు 14 యూనిట్ల వరకూ తగ్గిందని వివరించారు. -
బారులు తీరిన జనం
మొదలైన చేప ప్రసాద వితరణ నేటి సాయంత్రం వరకూ కొనసాగింపు అబిడ్స్, కలెక్టరేట్, న్యూస్‌లైన్ : చేపప్రసాదం కోసం వచ్చిన ఆస్తమా రోగులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిటకిటలాడుతోంది. ఆదివారం మొదలైన చేపప్రసాద వితరణ సోమవారం సాయంత్రం వరకూ కొనసాగనుంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనా ఆదివారం ఉదయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఐజీ మల్లారెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డిలు బందోబస్తును పర్యవేక్షించారు. మూడేళ్ల క్రితం రాజేంద్రనగర్ చేప ప్రసాదం పంపిణీ చేయగా విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చేప ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రెవెన్యూ, ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, పోలీస్ శాఖలను ఆదేశించింది. దీంతో ఉన్నత స్థాయి అధికారులు స్వయంగా చేప ప్రసాదం పంపిణీ ప్రశాంతంగా, జోరుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. చేప ప్రసాద వితరణకు హాజరైన ప్రజలకు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు మంచినీరు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. తప్పిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేకంగా పబ్లిక్ అడ్రస్ సిస్టంను సమాచార శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అశ్విని మార్గం, మాజీ కార్యదర్శి ఆర్. సుఖేష్ రెడ్డి, ఇతర నాయకులు అనిల్ స్వరూప్ మిశ్రా, హైదరాబాద్ ఆర్డీవో నిఖిలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. సోమవారం కూడా చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని సోదరులు తెలిపారు. ‘డిస్కవరీ’ ద్వారా తెలుసుకున్నా ఆస్తమా వ్యాధి నయం చేయడానికి బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు డిస్కవరీ చానెల్ ద్వారా తెలుసుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చి చేప ప్రసాదం తీసుకోవడం ఇదే మొదటిసారి. గత రెండు సంవత్సరాలుగా ఆస్తమా వ్యాధితో బాధపడుతూ అల్లోపతి మందులను వాడుతున్నాను. ఒకవేళ ఈ చేప ప్రసాదంతో నా వ్యాధి తగ్గితే మరింత మందికి ప్రచారం చేస్తా. - రీణ, డెహ్రాడూన్ మొదటిసారి వచ్చా ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం గురించి స్నేహితుల ద్వారా తెలుసుకుని మొదటిసారి ప్రసాద వితరణకు వచ్చాను. ఆస్తమా వ్యాధి నయమైతే మరింత మందికి వివరిస్తా. నిర్వాహకులు ఇంతమందికి పంపిణీ చేయడం చూసి ఆశ్చర్యపోయా. ఏర్పాట్లు బావున్నాయి. - మార్క్, ఇంగ్లండ్ రెండేళ్లుగా వస్తున్నా గత ఐదు సంవత్సరాలుగా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నాను. గత సంవత్సరం చేప ప్రసాదం తీసుకున్న తరువాత కొంత ఉపశమనం కలగడంతో ఈ ఏడాది సైతం చేప ప్రసాదాన్ని స్వీకరించాను. ఈ ప్రసాదం స్వీకరించడం వల్ల వ్యాధి బారి నుంచి కొంత ఉపశమనం కలిగింది. - శోభకరగే, మహారాష్ట్ర